వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐకి డిగ్గి యజమానా?: బాబు, టి నోట్‌పై స్పందన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ యజమానా? అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం మండిపడ్డారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దిగ్విజయ్‌ను సిబిఐ డైరెక్టర్ ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు తమ రాజకీయ లబ్ధి కోసం సిబిఐను వాడుకుంటోందన్నారు.

రాజకీయాలకు అతీతంగా సిబిఐ పని చేయాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిది తమ డిఎన్ఏ అని డిగ్గీ అంటారు, పొత్తు ఉండవచ్చునని వీరప్ప మొయిలీ చెబుతారని.. వారి వ్యాఖ్యలతోనే జగన్ - కాంగ్రెసు పార్టీల మధ్య ఒప్పందం అర్థమవుతోందన్నారు. కాంగ్రెసు పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారని, పరువు తీశారని మండిపడ్డారు.

దొంగలు, అవినీతిపరులకు సిబిఐ అండగా నిలుస్తోందన్నారు. ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు కాంగ్రెసు సిబిఐని పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. జగన్‌కు బెయిల్ వచ్చే సమయంలో మెమో దాఖలు చేయడమేమిటన్నారు. గతంలో వేసిన ఛార్జీషీట్లు, తాజా మెమో పరస్పరం విరుద్దమని చెప్పారు.

తెలంగాణపై...

ఆంటోని కమిటీ రాష్ట్రానికి వచ్చి సమస్యలు వింటుందని ఒకరు చెబుతారు, రాదని మరొకరు చెబుతారని ఇదేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల ఐక్యకార్యాచరణ సమితి నేతలను కూర్చుండబెట్టి సమస్యను పరిష్కరించాలని తాము సూచించామన్నారు. తెలంగాణ నోట్ పై స్పందించేందుకు నిరాకరించారు. తాను ఊహాజనిత వార్తలకు స్పందించనన్నారు.

English summary
Telugudesam Party cheif Nara Chandrababu Naidu on Thursday questioned that Is Digvijay owner of CBI?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X