ఎమ్మెల్యేలకు ఫోన్లు: రాయల టిపై కూపీలాగుతున్నారు!

అసెంబ్లీకి వచ్చే ముసాయిదా బిల్లులో రాయల టి అంశం ఉండవచ్చుననే ప్రచారం నేపథ్యంలో నిఘా వర్గాలు దీనిపై ఫోన్లు చేసి ఆరా తీయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యేలు ఎవరు రాయల తెలంగాణకు సమ్మతించలేదని సమాచారం. తమ తమ పార్టీ విధానాన్నే వారు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
ఉద్యమకారులు, ప్రజలు రాయల టికి అంగీకరిస్తారా? హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణనే కోరుకుంటున్నారా? చెప్పాలని ఎమ్మెల్యేలకు నిఘా విభాగం నుండి ఫోన్లు వచ్చాయని సమాచారం. పది జిల్లాల తెలంగాణకే తాము కట్టుబడి ఉన్నామని బిజెపి, తెరాసలు చెప్పాయి. బిల్లు చూశాక చెబుతామని సిపిఎం చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఐబి నుండి ఫోన్ వచ్చింది: మోత్కుపల్లి
తనకు రాయల తెలంగాణ అంశంపై ఐబి నుండి ఫోన్ వచ్చిందని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. కేంద్రం రాయల టిపతో మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ బిల్లు ఆమోదించుకునేందుకు కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు. పది జిల్లాల తెలంగాణకే టిడిపి కట్టుబడి ఉందని, కెసిఆర్, సోనియా ఆడుతున్న నాటకమే రాయల టి అన్నారు.












Click it and Unblock the Notifications