అది దేవస్థానమా స్మశాన వాటికనా తిరుమలలో సీపీఐ నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు
తిరుమలకు వెళ్లిన సిపిఐ నారాయణ తిరుమలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమలలోని శ్రీవారి దర్శనం తాను ఇంకా చేసుకోలేదని పేర్కొన్న సిపిఐ నారాయణ తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి టిటిడి ట్రస్ట్ ఉందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో కర్ణాటకలోని ధర్మస్థళ ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందని వ్యాఖ్యలు చేశారు.
500 మందిపై లైంగిక దాడి చేసి హత్య చేసి పూడ్చి పెట్టారు
ధర్మస్థల ట్రస్ట్ కు ఏడాదికి వంద కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని పేర్కొన్న నారాయణ ధర్మస్థళ దేవస్థానంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అన్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేసి దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. ధర్మస్థళ ట్రస్ట్ ను వెంటనే ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్న నారాయణ 500 మందిపై లైంగిక దాడి చేసి హత్య చేసి పూడ్చి పెట్టారన్నారు.

అది దేవస్థానమా స్మశాన వాటికనా?
అది దేవస్థానమా లేక స్మశాన వాటికనా అని ప్రశ్నించారు. ట్రస్ట్ చైర్మన్ ను, సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. తవ్వేకొద్దీ పుర్రెలు, ఎముకలు బయట పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో సిపిఐ నేత ఎంపీగా చేయకూడదని ట్రస్టు సభ్యులు అడ్డుకున్నారని, అతను తెగించి పోటీ చేసినందుకు 15 ఏళ్ల ఆయన కుమార్తెను అత్యాచారం చేసి చంపేశారని సిపిఐ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల స్వామి సాక్షిగా సీపీఐ నారాయణ డిమాండ్
ఇలాంటి ఘటనలు ట్రస్ట్ ల యొక్క పవిత్రతను ప్రశ్నిస్తాయన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ ట్రస్టు చైర్మన్ తో పాటు సభ్యులందరినీ అరెస్టు చేయాలని, ట్రస్ట్ ను ఎండోమెంట్ కి హ్యాండోవర్ చేయాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు.ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కర్ణాటకలోని ధర్మస్థళ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది .
ధర్మస్థళలో తవ్వకాలు.. దర్యాప్తు సాగుతుందిలా
ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం మరో ప్రదేశంలో తవ్వకాలను చేపట్టగా, ఇప్పటివరకు ఆ స్థలంలో ఏమి లభించాయి అన్నది వెల్లడించలేదు. ఈ తవ్వకాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఇక అన్ని ఆధారాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదికలు, చట్టపరమైన ప్రక్రియల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సిట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో జరుగుతున్న దర్యాప్తు కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ వర్గాలలోను, ప్రజలలోను సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications