• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగుదేశం పార్టీని బ‌లోపేతం చేస్తున్న జగన్ ప్ర‌భుత్వం??

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ నేత అయ్య‌న్న‌పాత్రుడి ఇంటి గోడ‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూల్చివేయించారంటూ ఆ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాలు టీడీపీని బ‌లోపేతం చేస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అర్థ‌రాత్రి స‌మ‌యంలో బుల్‌డోజ‌ర్‌తో గోడ‌ను ప‌డ‌గొట్ట‌డంతో రాష్ట్ర‌వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి.

టీడీపీలో స్ఫూర్తిని నింపుతున్న సంఘటనలు

టీడీపీలో స్ఫూర్తిని నింపుతున్న సంఘటనలు


న‌ర్సీప‌ట్నం పుర‌పాల‌క సంఘ ప‌రిధిలో ఉన్న అయ్య‌న్న‌పాత్రుడి ఇంటి గోడ‌ను పంట‌కాల్వ ఆక్ర‌మించి క‌ట్టారంటూ కూల్చ‌డానికి క‌మిష‌న‌ర్ చెప్పిన కార‌ణంపై ఆయ‌న కుటుంబ స‌భ్యులు మండిప‌డుతున్నారు. ఆయ‌న కుమారుడు విజ‌య్ నిర‌స‌న దీక్ష చేప‌ట్ట‌డం.. మ‌ద్ద‌తుగా వంద‌ల సంఖ్య‌లో పార్టీ శ్రేణులు త‌ర‌లిరావ‌డం.. పోలీసుల‌కు పోటీగా అయ్య‌న్న ఇంటి ద‌గ్గ‌ర వేల సంఖ్య‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు మొహ‌రించ‌డంలాంటివ‌న్నీ ఆ పార్టీలో స్ఫూర్తిని నింపుతున్నాయ‌ని భావిస్తున్నారు. అలాగే 'ఛలో నర్సీపట్నం' కు పిలుపునివ్వ‌డంతో అనూహ్య స్పంద‌న రావ‌డం, కొంద‌రు నేత‌లు పోలీసుల‌ను త‌ప్పించుకొని అయ్య‌న్న ఇంటికి చేరి వారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. హైకోర్టు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స్టే విధించింది.

రివర్స్ అవుతున్న ప్రభుత్వ చర్యలు

రివర్స్ అవుతున్న ప్రభుత్వ చర్యలు

వైసీపీ ప్ర‌భుత్వ కోణంలో ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను బ‌ల‌హీన‌ప‌రిచి రాబోయే ఎన్నిక‌ల్లో తాము మ‌రింత బ‌లోపేతం అవ్వాల‌నేదే ఆ పార్టీ ప్ర‌ణాళిక‌గా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే ఈ క్ర‌మంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌న్నీ రివ‌ర్స్ అయి తెలుగుదేశానికి బ‌లం చేకూరుస్తున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అన్ని జిల్లాల్లోని పార్టీ నాయ‌కులు ఐక‌మ‌త్యం అవుతున్నార‌ని, విభేదాల‌న్నీ ప‌క్క‌న‌పెట్టి అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి పార్టీని గెలిపించుకోవాల‌నే స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి ఇంటిలిజెన్స్ నివేదిక అంద‌జేసింది.

ఉత్సాహంగా పోరాడేందుకు సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు

ఉత్సాహంగా పోరాడేందుకు సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు


జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌న్నీ ఆ పార్టీ నేత‌ల్లో, కార్య‌క‌ర్త‌ల్లో స్ఫూర్తిని ర‌గిలిస్తున్నాయ‌ని, మ‌రింత ఉత్సాహంగా పోరాడేందుకు ఇవి కార‌ణ‌మ‌వుతున్నాయ‌నే భావ‌న వైసీపీ నేత‌ల్లో కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. పీ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌వ‌ల్లే న‌ర్సీప‌ట్నంలో పార్టీ శ్రేణులు ఒక్క‌తాటిమీద‌కు వ‌చ్చాయ‌ని, రాష్ట్ర‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి ఉంద‌ని, మున్ముందు ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌రిన్ని చోటుచేసుకుంటే త‌మంత‌ట తామే తెలుగుదేశం పార్టీని గెలిపించే ప‌రిస్థితి వ‌స్తుందేమోననే సందేహాన్ని కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

English summary
Some recent developments are inspiring the Telugu Desam Party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X