షాక్: అఖిలప్రియకు పవన్ కళ్యాణ్ 'నో'? చిరంజీవికే దూరం.. 'భూమా' ఎంత?

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి, టిడిపి నేత అఖిలప్రియకు షాకిచ్చారా? అపాయింటుమెంట్ కోరితే ఇవ్వలేదా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది.

వైసిపి నుంచి వస్తే గ్రీన్ సిగ్నల్, టిడిపిలో అసంతృప్తి: అఖిలప్రియకు షాక్

నంద్యాల ఉప ఎన్నికల్లో వాడిగా, వేడిగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. వైసిపి, టిడిపి నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. ఇటీవల పవన్.. సీఎం చంద్రబాబును కలిశారు. తాను రెండు రోజుల్లో మద్దతుపై ప్రకటన చేస్తానని చెప్పారు.

ఇంకా డైలమాలో ఉన్నారా

ఇంకా డైలమాలో ఉన్నారా

కానీ నంద్యాల ఉపఎన్నికల్లో మద్దతిస్తానో ఎవరికి మద్దతిస్తాననే విషయమై పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. ఎన్నికలకు ముందు ప్రకటిస్తారా లేక అసలు ప్రకటించే అవకాశాలు లేవా తెలియాల్సి ఉంది. ఆయనే స్వయంగా రెండు రోజుల్లో చెబుతానన్నారు. కానీ ఇప్పటి దాకా తేల్చలేదు. దీంతో ఆయన ఇంకా డైలమాలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

Chandrababu Concerns on Pawan Kalyan.. Why?
అఖిలప్రియకు పవన్ కళ్యాణ్ నో చెప్పారా

అఖిలప్రియకు పవన్ కళ్యాణ్ నో చెప్పారా

పవన్ కళ్యాణ్ తమకు మద్దతు పలుకుతారని అఖిలప్రియ మొదటి నుంచి ఆశతో ఉన్నారు. ఆయనకు, తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన మాకే మద్దతిస్తారని ఇటీవల చెప్పారు. ఇందులో భాగంగా మద్దతు కోరేందుకు అఖిల.. పవన్ కళ్యాణ్ అపాయింటుమెంట్ అడిగారని తెలుస్తోంది. కానీ ఆయన అందుకు నో చెప్పారని ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో తేలాల్సి ఉంది.

ఒకవేళ నో చెప్తే.. అందుకేనా

ఒకవేళ నో చెప్తే.. అందుకేనా

అఖిలప్రియకు అపాయింటుమెంట్ ఇచ్చేందుకు నో చెప్పింది నిజమే అయితే.. ఆయన డైలమాలో ఉండటమే కారణమే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని, ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడేసేందుకు వస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. భూమా కుటుంబానికి మద్దతు పలకాలనే భావన ఉన్నప్పటికీ అందుకే మౌనంగా ఉండి ఉంటారా అనే చర్చ సాగుతోంది.

అఖిలప్రియ అలా చెప్పినప్పటికీ..

అఖిలప్రియ అలా చెప్పినప్పటికీ..

అదే సమయంలో, పవన్ కళ్యాణ్ ఎవరికో భయపడి పని చేయరని, భూమా కుటుంబానికి మద్దతివ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చే వారని చెబుతున్నారు. అఖిలప్రియ చెప్పినట్లు.. కుటుంబంతో మంచి సంబంధాలు ఉండవచ్చునని, కానీ రాజకీయాలు వేరు, కుటుంబం వేరు అంటున్నారు.

చిరంజీవే ఉదాహరణ

చిరంజీవే ఉదాహరణ

భూమా కుటుంబంతో పవన్ కళ్యాణ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయనేది నిజమే. కానీ అంతమాత్రాన ఆయన గుడ్డిగా మద్దతు పలకరని గుర్తు చేస్తున్నారు. చిరంజీవి విషయంలోనే ఈ విషయం తెలుస్తుందంటున్నారు. రాజకీయ లక్ష్యాల కోసం తాను సొంత అన్నయ్యనే పక్కన పెట్టానని, ఇక టిడిపికి మద్దతు పలకాల్సిన అవసరం ఏముందని సూటిగా చెప్పారు.

భూమా బ్రహ్మానంద రెడ్డికీ వర్తిస్తుంది

భూమా బ్రహ్మానంద రెడ్డికీ వర్తిస్తుంది

ఓ విధంగా అన్నయ్యను పక్కన పెట్టిన తనకు టిడిపి ఎంత అన్నారు. కాబట్టి ఇప్పుడు అది భూమా బ్రహ్మానంద రెడ్డికి కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి భూమా కుటుంబంతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఆయన అండగా నిలబడలేరని అంటున్నారు.

2019లో ఒంటరి పోరుకు వెళ్దామనుకుంటే..

2019లో ఒంటరి పోరుకు వెళ్దామనుకుంటే..

2019లో ఒంటరి పోరు లేదా లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్దామని ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరికీ మద్దతు ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. ఇప్పుడు ఓ పార్టీకి మద్దతు పలికి, ఏడాది తర్వాతనే వారికి దూరమైతే ఇతర పార్టీలకు ప్రశ్నించే అవకాశం ఇచ్చినట్లవుతుందని కొందరు భావిస్తున్నారు. టిడిపితో కలిసి వెళ్లాలనే అభిప్రాయంతో ఉంటే మాత్రం బ్రహ్మానంద రెడ్డికి మద్దతుగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Is Pawan Kalyan rejects appointment to Akhila Priya?
Please Wait while comments are loading...