హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్కేకు ఎలాంటి హాని తలపెట్టొద్దు: ఏపీకి హైకోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ(ఆర్కే) ఆచూకీపై అతని భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నట్లయితే.. అతనికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టొద్దని కోర్టు ఆదేశించింది.

తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. ఈ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఆర్కే ఆచూకీ తమకూ కూడా తెలియాలని హైకోర్టు.. ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మావోయిస్టులైనా.. సామాన్యులైనా రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వమేనని పేర్కొంది.

ఆర్కే ఆచూకీపై హైకోర్టులో భార్య శిరీష పిటిషన్ దాఖలు

కాగా, ఒడిశాలో ఎన్ కౌంటర్ జరిగినందున తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. పోలీసుల కష్టడీలో ఆర్కే ఉంటే.. గురువారం లోపల తమ వద్ద హాజరుపర్చాలని కోర్టు స్పష్టం చేసిందని చెప్పారు.

Is RK Dead Or Alive? High Court Orders AP Govt To File Counter By Thursday

ఆర్కే బతికే ఉన్నాడని అర్థమవుతోందని ఆమె అన్నారు. కోర్టు తీర్పుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం స్పష్టత వచ్చే అవకాశముందని ఆర్కే భార్య శిరీష తెలిపారు.

ఎన్ కౌంటర్ సమయంలో ఆర్కేకు గాయాలయ్యాయని, గ్రేహౌండ్స్ పోలీసుల కస్టడీలోనే ఆర్కే ఉన్నారని శిరీష తరపు న్యాయవాది ఆరోపించారు. ఆర్కేకు ప్రాణహాని ఉందని స్పష్టంగా సమాచారం వచ్చిందని చెప్పారు. ఆర్కే పోలీసుల కష్టడీలో లేకుంటే.. ఇప్పటికే సమాచారం ఇచ్చేవారు కాదా? అని కోర్టు ప్రశ్నించినట్లు తెలిపారు.

బూటకపు ఎన్‌కౌంటర్లో చంపడానికి వీల్లేదన కోర్టు చెప్పిందని చెప్పారు. ఆర్కే బతికి ఉన్నాడా? లేదా? అనేది ప్రభుత్వం చెప్పాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. మానవ హక్కులకు జూరిసిడిక్షన్లు లేవని కోర్టు తెలిపిందని ప్రజా సంఘాల నేతలు అన్నారు. అంతేగాక, ఇటువంటి కేసు ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని కోర్టు అభిప్రాయపడినట్లు చెప్పారు. గురువారం లోపల స్పష్టమైన కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు.

ఆర్కే, ఇతర మావోయిస్టు నేతలు పోలీసుల కష్టడీలో ఉంటే వెంటనే కోర్టులో హాజరుపర్చాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. కోర్టు కూడా అదే చెప్పిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆర్కేను కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు.

English summary
The Hyderabad High Court on Monday ordered the Andhra Pradesh government to file a counter on a Habeas Corpus petition filed by Sirisha, wife of Maoist top leader Ramakrishna (RK), seeking police to produce her husband in the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X