వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్జిలకే ఆత్మాభిమానం - ముఖ్యమంత్రికి ఉండదా : ఏపీ ఉద్యోగ సంఘ నేత సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనే విచిత్ర పరిస్థితులన్నాయన్నారు. కొన్ని రాజ్యాంగ సంస్థలు ప్రభుత్వాన్ని నియంత్రించే పరిస్థితులు చూస్తు న్నామని చెప్పుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేంలో వెంకట్రామిరెడ్డి మంచి చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని..దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఉద్యోగి పైనా ఉందన్నారు. అదే సందర్భంలో న్యాయవ్యవస్థలో ఉండే లోపాలపైనా మనం చర్చించుకోవాలని అభిప్రాయపడ్డారు.

బెయిల్ విషయం పైనా వ్యాఖ్యలు

బెయిల్ విషయం పైనా వ్యాఖ్యలు

జడ్జిలపై వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌లు పెడితే మూడు నెలలు బెయిల్‌ రాదని.. మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రిని తిడితే మాత్రం గంటలో బెయిల్ వచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందని వ్యాఖ్యానించారు. జడ్జిలకే ఆత్మాభిమానం ఉంటుందా.. ముఖ్యమంత్రులకు ఉండదా..అంటూ నిలదీసారు. ఒక మాజీ మంత్రి బహిరంగ సభలో ఇష్టమొచ్చినట్లు తిడితే ఆయన జోలికి వెళ్లొద్దన్నారని చెప్పుకొచ్చారు. మనం ఎక్కువ మాట్లాడితే కోర్టు ధిక్కరణ అంటారి...కానీ, కొన్ని వాస్తవాలను మాట్లాడుకోవాలి. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగకుండా మనందరం చూడాలని వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.

ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటూ

ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటూ


ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని అడ్డుకుని.. ప్రజల్లో సానుకూలత పెరిగేలా చూడాలని కోరారు. చూశాం. ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు కార్నర్‌ చేయాలని చూస్తోందని చెన్నైకు చెందిన ప్రముఖ లాయర్‌ వ్యాఖ్యానించారని చెప్పారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను కోర్టుకు పిలిచి గంటలకొద్దీ వెయిట్‌ చేయిస్తున్నారని చెబుతూ..ఈ పరిస్థితి నిజంగా బాధనిపిస్తోందని చెప్పుకొచ్చారు. న్యాయమూర్తులకు ఎంతో విలువ ఇస్తున్నామని.. జడ్జిలు కరకట్ట రోడ్డులో వారి కోసం సచివాలయ ఉద్యోగులు ఆగుతున్నారని చెప్పారు.

వెంకటరామిరెడ్డి వ్యాఖ్యల వైరల్

వెంకటరామిరెడ్డి వ్యాఖ్యల వైరల్


గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా ప్రవర్తించిందో చూశామంటూ గుర్తు చేసారు. ప్రభుత్వంలో మనం భాగమే కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీసుకోవాలని వెంకట్రామిరెడ్డి సూచించారు. కొత్త జిల్లాలకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సభ్యత్వ నమోదును ప్రారంభించాలని సమావేశంలో తీర్మానించారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగ సంఘ నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

English summary
AP Secretariat Employees association leader controversy comments on Judiciary, became viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X