శిల్పా చక్రపాణిపై అనుమానం, బాబుకు షాక్: వారు వైసిపి కోసమేనా?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నంద్యాల పర్యటనలో షాకిచ్చారు. ఇందుకు మంత్రి అఖిలప్రియ దూరం పెట్టడంతో పాటు మరో కారణం కూడా ఉందంటున్నారు.

నంద్యాల: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నంద్యాల పర్యటనలో షాకిచ్చారు. ఇందుకు మంత్రి అఖిలప్రియ దూరం పెట్టడంతో పాటు మరో కారణం కూడా ఉందంటున్నారు.

శిల్పా చక్రపాణిపై ఇలా..

శిల్పా చక్రపాణిపై ఇలా..

తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరి, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తుండటంతో భూమా వర్గం ఈయనపై విశ్వాసం ఉంచడం లేదని తెలుస్తోంది. దానికి తోడు నిధులు కూడా లేవని ఆయన ఆవేదన చెందుతున్నారని తెలుస్తోంది.

Recommended Video

    TDP Senior Leader Shilpa Mohan Reddy Announced Date to Join YSRCP | Oneindia Telugu
    భూమా వర్గం కలుపుకు పోవడం లేదా?

    భూమా వర్గం కలుపుకు పోవడం లేదా?

    ఇటీవల చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. తనకు విధులు లేవు, నిధులు లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చక్రపాణి అనుచరులు దూరంగా ఉంటున్నారు. వీరిని భూమా వర్గం కలుపుకొని పోయే ప్రయత్నం చేయడం లేదంటున్నారు.

    సోదరుడి కోసం పని చేస్తున్నారా?

    సోదరుడి కోసం పని చేస్తున్నారా?

    దీంతో చక్రపాణి అనుచరులు వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కోసం పని చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, చక్రపాణి వర్గం తీరు అనుమానంగా ఉండటంతోనే భూమా వర్గం పక్కన పెట్టిందని ఇంకొందరు అంటున్నారు.

    దూరం.. దూరం

    దూరం.. దూరం

    మొత్తానికి, నంద్యాల చంద్రబాబు పర్యటనలో చక్రపాణి రెడ్డి దూరం పాటించడం ద్వారా సోదరుడికి అనుకూలంగా పని చేస్తున్నట్లుగా కనిపిస్తోందని స్పష్టమవుతోందని అంటున్నారు. కాగా, అభివృద్ధి పనులకు శిల్పాను టిడిపి పక్కన పెట్టిందా లేక అఖిలపై అసంతృప్తితో శిల్పానే బాబు పర్యటనకు హాజరవలేదా? ఇది చంద్రబాబుకు తెలిసి మౌనంగా ఉన్నారా అనే చర్చ సాగుతోంది. గతంలో చక్రపాణి రెడ్డి గెలుపుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమా వర్గం సహకరించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+