జగన్‌కు సోనియా ఫోన్: ఆహ్వానం?

YS Jagan Mohan Reddy: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత దేశంలో రాజకీయ పరిణామలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేకించి- కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది చర్చనీయాంశమౌతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏకు బొటాబొటి మెజారిటీ సీట్లు లభించడం, ఆ తరువాత కూటమిలో లుకలుకలు ఏర్పడటం శరవేగంగా సాగిపోయాయి.

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 272. దీనికి 20 సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది ఎన్డీఏ సంకీర్ణ కూటమి. 292 సీట్లకు పరిమితం అయింది. సొంతంగా మెజారిటీని సైతం తెచ్చుకోలేకపోయింది బీజేపీ. ఆ పార్టీకి దక్కింది 240 స్థానాలే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు అత్యవసరం.

Is Sonia Gandhi called YS Jagan and requested to support INDIA Alliance

అటు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 234 స్థానాలు లభించాయి. ఇతరులు 17 చోట్ల గెలిచారు. అయినప్పటికీ- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ప్రస్తుతానికి అందుకోలేకపోయిందీ ఇండియా అలయెన్స్. దీనితో తటస్థ పార్టీల మద్దతును కూడగట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేజిక్ ఫిగర్‌ను అందుకోవడానికి ఏ చిన్న అవకాశాన్నీ జారవిడచుకోవట్లేదు.

మహారాష్ట్రకు చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి ఇండియా కూటమికి తన మద్దతును ప్రకటించారు కూడా. సాంగ్లీ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఇండిపెండెంట్ విశాల్ ప్రకాష్‌బాపూ పాటిల్.. కాంగ్రెస్‌కు జై కొట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీని కలిశారు. తాను సంపూర్ణ మద్దతు అందజేస్తోన్నట్లు లిఖిపూరకంగా ప్రకటించారు.

ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సైతం సంప్రదింపులు జరిపిందని తెలుస్తోంది. దీని కోసం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీరంగంలో దిగారని అంటున్నారు. ఆమె స్వయంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారని, ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానించారని చెబుతున్నారు. ఈ ఆహ్వానాన్ని వైఎస్ జగన్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.

లోక్‌సభలో వైఎస్ఆర్సీపీకి నలుగురు సభ్యుల బలం ఉంది. అరకు- తనూజా రాణి, కడప- వైఎస్ అవినాష్ రెడ్డి, తిరుపతి- డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి, రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటిస్తే మేజిక్ ఫిగర్‌కు మరింత చేరువు అవుతుంది ఇండియా కూటమి.

రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థి తెలుగుదేశం.. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపక్షంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి జాతీయ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ వస్తోంది. అటు ఎన్డీఏలో గానీ, ఇండియా కూటమిలో గానీ చేరలేదు. అధికారంలో ఉన్న అయిదు సంవత్సరాల కాలంలో కొన్ని కీలక బిల్లుల విషయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందే తప్ప పూర్తిస్థాయిలో మద్దతును ప్రకటించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+