చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై అనూహ్య ఘటన: తమిళిసైని హెచ్చరించిన అమిత్ షా
Chandrababu Naidu: రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్.. ఆయనతో ప్రమాణం చేయించారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం విభజనాంధ్ర ప్రదేశ్‌లో ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకోబోనున్నారు.

కాగా- ఈ సభా వేదికపై అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఆమె వేదిక మీదికి వచ్చిన వెంటనే అప్పటికే అక్కడ ఆసీనులై ఉన్న ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు అభివాదం చేశారు.
దీనికి ప్రతిగా వారిద్దరూ తమిళిసైను నవ్వుతూ పలకరించారు. ప్రతి నమస్కారం చేశారు. వారిని దాటుకుని తమిళిసై ముందుకు వెళ్లబోతోండగా.. అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. దీనితో ఆమె అమిత్ షా వద్దకు చేరుకున్నారు. అమిత్ షా సీరియస్‌గా ఆమెను మందలిచడం కనిపించింది. వేలు చూపుతూ కోపంతో మాట్లాడారు అమిత్ షా.

తమిళిసై సౌందరరాజన్ ఏదో సంజాయిషీ ఇవ్వబోతోన్నప్పటికీ- అమిత్ షా వినిపించుకోలేదు. తనకు ఎలాంటి సంజాయిషీలు చెప్పొద్దంటూ చేతులు అడ్డంగా ఊపడం కనిపించింది. వారిద్దరి సంభాషణను పక్కనే ఉన్న వెంకయ్యనాయుడు, వెనకలే కూర్చున్న కేందమంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆసక్తి విన్నారు.
తమిళిసై అమిత్ షా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవలే ఆమె పార్టీ అధిష్ఠానంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్రశాఖలో అసాంఘిక శక్తులు కీలక పోస్టులను పొందుతున్నారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలైని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications