విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌పై వంగవీటి అసంతృప్తితో ఉన్నారా? ఎందుకంటే...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తితో ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం ఉందని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తితో ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం ఉందని అంటున్నారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో పార్టీ బాధ్యతలను వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అప్పగించారు. ఆయన బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి మాజీ నగర అధ్యక్షులు రాధాకృష్ణ హాజరు కాలేదు. దీంతో ఈ చర్చ జరుగుతోందని అంటున్నారు.

<strong>మేం డిఫెన్స్‌లో పడలేదు: పెద్దిరెడ్డి, జగన్ కోపం తగ్గేందుకు డొక్కా సలహా</strong>మేం డిఫెన్స్‌లో పడలేదు: పెద్దిరెడ్డి, జగన్ కోపం తగ్గేందుకు డొక్కా సలహా

Is Vangaveeti Radhakrishna unhappy with YS Jagan?

రాజధాని ప్రాంతానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉందని, ఎన్నికల సమయంలో నగర వైసిపిని బలోపేతం చేసే బాధ్యతను పార్టీ అధినేత జగన్.. వెల్లంపల్లికి ఇచ్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు.

గాంధీ నగర్లోని పార్టీ కార్యాలయంలో వైసిపి నగర అధ్యక్షుడిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నగర నాయకుల అంగీకారంతోనే బాధ్యతలు చేపట్టినట్లు వెల్లంపల్లి చెప్పారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి నగర మాజీ అధ్యక్షులు రాధాకృష్ణ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన విముఖంగా ఉండవచ్చునని, అందుకే రాలేదేమో అంటున్నారు.

English summary
Is Former MLA Vangaveeti Radhakrishna unhappy with YSRCP Chief YS Jagan?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X