Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతిలో కొత్త ట్విస్టులు- అలర్ట్ అవుతున్న జగన్- విశాఖ లీకుల వెనుక?

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి స్ధానంలో మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి. కానీ రెండేళ్ల న్యాయపోరాటాల తర్వాత తిరిగి అమరావతే రాజధానిగా మిగిలింది. దీంతో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించడం లేదు. కానీ త్వరలో విశాఖకు రాజధాని తరలిస్తామని మాత్రం లీకులిస్తోంది. దీంతో వాస్తవంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందనే చర్చ క్షేత్రస్ధాయిలో మొదలైంది.

అల అమరావతిలో..

అల అమరావతిలో..

గత టీడీపీ ప్రభుత్వంలో రాజధానిగా ఎంపికైన అమరావతి భవిష్యత్తులోనూ రాజధానిగా ఉంటుందా లేదా అన్న చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఆర్డీయే చట్టం ప్రకారం అమరావతిలోనే రాజధాని ఉండాలని హైకోర్టు తీర్పునిచ్చినా అది అమలవుతుందా లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు విశాఖకు రాజధాని తరలింపుపై చేస్తున్న ప్రకటనలే. త్వరలో విశాఖ నుంచే పాలన మొదలవుతుందంటూ వారు చేస్తున్న ప్రకటనలతో హైకోర్టు తీర్పు అమలు ప్రశ్నార్ధకంగా మారుతోంది.

పెరుగుతున్న చంద్రబాబు గ్రాఫ్?

పెరుగుతున్న చంద్రబాబు గ్రాఫ్?

అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైఎస్ జగన్ వాటిని అమల్లోకి తీసుకురావడంలో విఫలం కావడంతో అమరావతినే నమ్ముకున్నచంద్రబాబు గ్రాఫ్ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రకటించిన చంద్రబాబు, దాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు తప్పితే పూర్తిగా పక్కన పెట్టలేదు. కానీ జగన్ మాత్రం అమరావతిని పక్కనబెట్టారు. దీంతో అమరావతితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో చంద్రబాబు గ్రాఫ్ మరింత పెరుగుతోంది. అదే సమయంలో విశాఖ, కర్నూలు వంటి ప్రాంతాల్లో రాజధానులు రాకపోవడంతో అక్కడి ప్రజల్లో జగన్ సర్కార్ పై అపోహలూ పెరుగుతున్నాయి.

జగన్ మౌనం-వైసీపీ లీకులు

జగన్ మౌనం-వైసీపీ లీకులు

విశాఖకు రాజధాని తరలింపుపై సీఎం జగన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అదే సమయంలో విశాఖకు రాజధాని తరలింపుపై వైసీపీ కీలక నేతలు మాత్రం లీకులు ఇస్తున్నారు. బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో జగన్ మనసులో ఉన్నదే వీరు బయటకు చెప్తున్నారా లేక జగన్ తాను మౌనంగా ఉంటూ వారితో ఈ లీకులు ఇప్పించి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ లీకులు ఇస్తున్న వారు కూడా జగన్ విశాఖ నుంచి త్వరలో పాలన మొదలుపెడతారనే చెప్తున్నారు. దీంతో ఏం జరుగుతుందోన్న ఉత్కంఠ అమరావతిలో పెరుగుతోంది.

 2024 అజెండాగా మారబోతోందా?

2024 అజెండాగా మారబోతోందా?

అమరావతిలో ఉన్న రాజధాని స్ధానంలో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అదే సమయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అడ్డంకిగా మారింది. అయినా ప్రభుత్వం మాత్రం విశాఖకు త్వరలో రాజధాని తరలిస్తామని ధీమాగా చెబుతోంది. మరోవైపు రాజధానుల్ని అమల్లోకి తేవడంలో జగన్ సర్కార్ విఫలమైతే మాత్రం ఈసారి 2024 ఎన్నికల్లో అమరావతికే ఓటేయమంటూ చంద్రబాబు తన వాదనను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దానికి కౌంటర్ గా జగన్ ఏం చేయబోతున్నారనే చర్చ పెరుగుతోంది. దీనిపై ఆగస్టు తర్వాత క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+