హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీ ఫ్యామిలీనే అలా తిడితే!: ఇరుకున పెట్టిన రోజా, ఆత్మరక్షణలో జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత పైన చేసిన వ్యాఖ్యలతో వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ఇరుకున పడ్డారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

మంగళవారం నాడు శాసన సభలో రోజా నాలుగు రోజుల క్రితం శాసన సభలో చేసిన వ్యాఖ్యల పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులు రోజా వ్యాఖ్యల పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలకు ఏడాది సస్పెన్షన్ ఏమాత్రం సరిపోదని చాలామంది అభిప్రాయపడ్డారు.

సభ్యులు అనిత, పీతల సుజాత, మృణాళిని, విష్ణు కుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు రోజా పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలు రోజా దుమ్ము దులిపేశారు. రోజా మహిళా రౌఢీలా మాట్లాడుతున్నారని, ఆమె తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.

Is YS jagan in defence with Roja comments?

దళితుల పట్ల రోజాకు ఇంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు. దళితుల పైన వైసిపి అధినేత రోజాకు ఏమాత్రం గౌరవం ఉన్న ఎమ్మెల్యే అనిత పట్ల తీవ్ర వ్యాఖఅయలు చేసిన రోజాను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఆమెను శాసన సభ నుంచి ఏడాది పాటు కాకుండా జీవితకాలంలో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని చాలామంది అభిప్రాయపడ్డారు. మహిళా ఎమ్మెల్యే పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాను జగన్ సమర్థించారని పలువురు సభ్యులు దనుమాడారు.

రోజా.. అనిత పైన చేసిన వ్యాఖ్యలే జగన్ కుటుంబ సభ్యుల పైన చేసి ఉంటే ఎలా ఉండేదని ప్రశ్నించారు. రోజా తనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పి అనిత జగన్‌ను నిలదీశారు.

మీ కుటుంబ సభ్యులకు ఇలా జరిగి ఉంటే ఎలా ఉండేదని ఆమె సభా వేదికగా ప్రశ్నించారు. కాగా, రోజా చంద్రబాబు పైన కూడా కామ బాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, చంద్రబాబు పైన అన్న మాటల కంటే ఎమ్మెల్యే వనిత పైన అన్న వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి.

English summary
Is YSRCP chief YS jagan in defence with Roja comments?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X