అందుకే రాజకీయాల్లో జగన్, ఇలాంటి వాళ్లు అవసరమా: యనమల సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటం అవసరమా అని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం ప్రశ్నించారు.

అసెంబ్లీలో భజన చిరాకేస్తోంది!: టీడీపీపై సంచలనం, విష్ణు నోట జగన్ మాటలు

అందుకే జగన్ రాజకీయాల్లో ఉన్నారు

అందుకే జగన్ రాజకీయాల్లో ఉన్నారు

దోచుకున్న సొమ్మును కాపాడుకునేందుకే జగన్ రాజకీయాల్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారం గురించి కలలు కనడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ అక్రమంగా సంపాదించారని ఆరోపించారు.

అడ్డదారుల్లో లూటీ, అక్కడి నుంచి సాక్షికి పెట్టుబడులు

అడ్డదారుల్లో లూటీ, అక్కడి నుంచి సాక్షికి పెట్టుబడులు

క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన సొమ్మును అంతా ట్యాక్స్ హెవెన్ దేశాలకు పంపించారని చెప్పారు. వాటని తిరిగి ఇక్కడకు తీసుకు వచ్చి సాక్షి మీడియాను పెట్టారని మండిపడ్డారు. జగతి పబ్లికేషన్స్ విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని పారడైజ్ పేపర్స్ ద్వారా తేలిపోయిందన్నారు. అడ్డదారుల్లో ప్రజా ధనాన్ని జగన్ లూటీ చేశారన్నారు.

ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో జగన్

ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో జగన్

ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో జగన్ పేరు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌పై వస్తున్న కొత్త కేసులపై సీబీఐ వెంటనే దర్యాఫ్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ఏమిటో, పారడైజ్, పనామా పేపర్లు చెబుతాయన్నారు.

రాజకీయాలకు జగన్ లాంటి వాళ్లు అవసరమా

రాజకీయాలకు జగన్ లాంటి వాళ్లు అవసరమా

జగన్ చేసేది ప్రజా సంకల్ప యాత్ర కాదని యనమల ఎద్దేవా చేశారు. ఆయన రాజకీయాల నుంచి విరమించాలనేది ప్రజా సంకల్పం అని ఎద్దేవా చేశారు. జగన్ తీరు వల్ల ఏపీ ప్రతిష్టకు భంగం కలుగుతోందన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్లు రాజకీయాలకు అవసరమా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh finance minister Yanamala Ramakrishnudu on Sunday questioned AP people that is YSRCP chief YS Jaganmohan Reddy need in politics.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి