వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నింగిలోకి జీఎస్ ఎల్వీ ఎప్ 9 ఉపగ్రహం ,, భాగస్వామ్యానికి పాకిస్తాన్ నో

జీఎస్ఎల్వీ ఎఫ్ -09 ఉపగ్రహాన్ని నెల్లూరు శ్రీహరికోట నుండి శుక్రవారం సాయంత్రం ప్రయోగించారు. ఈ ఉపగ్రహాం సార్క్ దేశాలకు 12 ఏళ్ళపాటు తన సేవలను అందించనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: జీఎస్ఎల్వీ ఎఫ్ -09 ఉపగ్రహాన్ని నెల్లూరు శ్రీహరికోట నుండి శుక్రవారం సాయంత్రం ప్రయోగించారు. ఈ ఉపగ్రహాం సార్క్ దేశాలకు 12 ఏళ్ళపాటు తన సేవలను అందించనుంది.

జీఎస్ ఎల్వీ ఎప్ -09 ఉపగ్రహానికి గురువారంనాడు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం పూట శ్రీహరికోట నుండి ఈ ఉపగ్రహన్ని ప్రయోగించారు.నిప్పులు కక్కుతూ ఈ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్ళింది.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆలోచనతో సార్క్ దేశాలకు ప్రయోజనం కల్పించేందుకుగాను ఈ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. అయితే ఈ ఉపగ్రహం సార్క్ దేశాలకు ప్రయోజనం ఉపయోగపడనుంది.

Isro launched GSLV F-9 satilite

ఈ ఉపగ్రహం భారత్ తో పాటు దక్షిణాసియా దేశాలకు సేవలను అందించనుంది.అయితే ఈ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యానికి పాకిస్తాన్ అంగీకరించలేదు.ఈ ఉపగ్రహం బరువు సుమారు 2,240 కిలోలు ఉంటుంది. 12 ఏళ్ళపాటు ఈ ఉపగ్రహం వీ-శాట్ సేవలను అందించనుంది.

జీఎస్ ఎల్ వీ ఎప్ 09 ఉపగ్రహా వాహకనౌక నింగిలోకి దూసుకెళ్ళింది. శుక్రవారం సాయంత్రం 4.57 నిమిసాలకు జీఎస్ఎల్ వీ ఎప్ 9 ఉపగ్రహా వాహక నౌకను ప్రయోగించారు. గురువారం మధ్యాహ్నం 12.57 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.

ప్రయోగాన్ని 20 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ సభ్యులతో షార్ నుండి ప్రత్యక్షంగా వీక్షించారు.ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్రాండ్ ట్రాన్స్ పార్మర్స్ ను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలకం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్ , మాల్దీవులు ఈ ఉపగ్రహం 12 ఏళ్ళపాటు సేవలను అందించనుంది.

ఇది 11వ, ప్రయోగం కావడం విశేషం, ఇప్పటివరకు నిర్వహించిన 10 ప్రయోగాల్లో 3 విఫలం కాగా, 7 విజయవంతమయ్యాయి. జీఎస్ ఎల్ వీ ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్షమైన క్రయోజనిక్ దశను స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు.

అయితే దక్షిణాసియా దేశాల కోసం రూపొందించిన ఈ ఉపగ్రహన్ని తాము పాల్గోనాలని భావించినప్పటికీ ఇండియా నుండి సానుకూలంగా స్పందించలేదని పాకిస్తాన్ చెబుతోంది.ఈ మేరకు ఈ ప్రాజెక్టులో తాము భాగస్వామ్యం కాలేదని పాకిస్తాన్ ప్రకటించింది.

English summary
Isro launched GSLV F-9 satilite successfully on Friday evening from Sriharikota of Nellore.It will work for 12 years SAARC countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X