పీఎస్‌ఎల్‌వీ -సీ29 ప్రయోగం విఫలం, సమీక్షిస్తోన్న శాస్త్రవేత్తలు
నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ -సీ29ఐఆర్ఎన్ఎస్ఎస్-1 హెచ్ ఉపగ్రహన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్‌ను పంపుతున్నారు
శ్రీహరికోట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పోలార్ ఉపగ్రహ వాహక నౌక - సీ 39 (పీఎస్ఎల్‌వీ) నింగిలోకి దూసుకెళ్ళింది. 29 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ అనంతరం గురువారం సాయంత్రం 7 గంటలకు రాకెట్‌ను ప్రయోగించారు.అయితే ఈ ప్రయోగం విఫలమైంది. హీట్‌షీల్డ్ నుండి ఉపగ్రహం నుండి వేరుకాలేదు.ఈ విషయాన్ని ఇస్రో అధికారులు ప్రకటించారు.
ఐఆర్ఎన్ఎస్ఎస్-1 హెచ్ ఉపగ్రహన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ రాకెట్‌ను విజయవంతంగా గగనంలోకి పంపేందుకు బుదవారం నాడు మధ్యాహ్నం రెండుగంటలకే కౌంట్ డౌన్ ప్రారంభమైంది.

నావిగేషన్ వ్యవస్థ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. ఇందులో 2013లో పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ ఉపగ్రహంలోని మూడు పరమాణు గడియారాలు మొరాయించి సేవలందడం లేదు. దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్‌ను పంపుతున్నారు.ఈ ఉప గ్రహం బరువు సుమారు 1,425 కిలోలు.
శాటిలైట్ ప్రయోగం వైఫల్యం కావడంపై శాస్త్రవేత్తలు సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయమై త్వరలోనే సమగ్రంగా ప్రకటించనున్నట్టు ఇస్రో ఛైర్మెన్ ప్రకటించారు.
ఉపగ్రహం ప్రయోగం సందర్భంగా తొలి మూడు దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే నాలుగో విడతలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో రాకెట్ నుండి ఉపగ్రహం విడిపోలేదు. దీంతో ప్రయోగం ఫెయిలైంది. ఇటీవలి కాలంలో ఇస్రో నిర్వహించిన ఉపగ్రహల్లో ఫెయిల్ కావడం బహుశా ఇదే తొలిసారి












Click it and Unblock the Notifications