ఇస్రో రికార్డ్..? 22న నింగిలోకి 36 ఉపగ్రహాలు..
ఇస్రో ఈ నెల 22వ తేదీన భారీ ప్రయోగానికి సిద్ధమైంది. మెుత్తం 5,400 కిలోల బరువు గల 36 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించాలని భావిస్తోంది. లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో సిద్దం అవుతోంది. ఇదివరకు జీఎస్ ఎల్వీ మార్క్ III ద్వారా ప్రయోగాలు చేసింది. తాజాగా భారీ ఉపగ్రహాలను ఆంధ్రప్రదేశ్‌లో గల శ్రీహరికోట రేంజ్ షార్‌లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది.

36 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి చేర్చడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌లు భారీగా వాణిజ్య లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కటి 150 కిలోల బరువున్న 36 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. జీఎస్ ఎల్వీ మార్క్ 3 ప్రయోగానికి సంబంధించి శ్రీహరికోటలో ఏర్పాట్లు నడుస్తున్నాయి.
గతంలో ఈ రాకెట్ ప్రయోగించాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఉపగ్రహాలు విడిచిపెట్టే ప్రదేశానికి సమీపంలో గ్రౌండ్ స్టేషన్ అందుబాటులో లేని కారణంగా అతి పెద్ద షిప్ లలో భూకేంద్రాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు.












Click it and Unblock the Notifications