త్వరలో శుక్రగ్రహంపై ఇస్రో పరిశోధనలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో సంచలన అధ్యాయానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే చంద్రుడు, అంగారక మిషన్లను విజయవంతంగా పూర్తి చేసి తదుపరి శుక్రుడుపై ప్రయోగానికి సిద్ధంగా ఉంది. మంచి వాతావరణం కలిగి, నివాసయోగ్యమైన గ్రహాలు, నక్షత్రాలు, ఎక్సో ప్లానెట్ ల రహస్యాలు శోధించే దిశగా దృష్టి సారిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహమైన శుక్రుడిపై భారత్ మిషన్ చేపట్టిందని, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేయడానికి రెడీ అవుతున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

ISRO

అంతరిక్ష వాతావరణం, భూమిపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి మరో రెండు ఉపగ్రహాలను సిద్ధం చేసే పనిలో ఉన్నామని తెలిపారు. శుక్ర గ్రహం ఆయన గ్రహం అని పేర్కొన్న ఆయన దాని వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువ అంటూ తెలిపారు. నాసా భవిష్యత్తులో మిషన్లు 2029, 2030, 2031లో చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అంగారక గ్రహంపై వ్యోమ నౌకను దింపే ప్రాజెక్టును కూడా రూపొందిస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. రాకెట్ డిజైన్, తయారీతో పాటు, వాటిలో ఉపయోగించే ముఖ్య విడి భాగాలైన ప్రాసెసర్, కంప్యూటర్ చిప్స్ వంటి వాటిని కూడా దేశీయంగా తయారు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

అంతరిక్ష పరిశోధనల కోసం అవసరమయ్యే సాంకేతికత, రాకెట్, ఉపగ్రహాల తయారీ, స్పేస్ అప్లికేషన్ వంటి వాటిని దేశంలోని వివిధ జాతీయ పరిశోధనా సంస్థలతో కలిసి ఇస్రో రూపొందిస్తుందని తెలిపారు. సీఎస్ఐఆర్ వంటి దేశీయ పరిశోధనా ల్యాబ్లో సహకారంతోనే తాము ఈ ఏ ఘనత సాధించగలిగాం అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. అంతేకాదు రాకెట్ లో ఉపయోగించే 95 విడి భాగాలను భారత్ నుండే సేకరించినట్టు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+