మంత్రి నారాయణ సన్నిహితుడి ఇంట్లో ఐటీ దాడులు: భారీగా ఆస్తుల గుర్తింపు
మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితుడు, ఎంసీఐ మాజీ సభ్యుడు డాక్టర్ గుణశేఖర్‌యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితుడు, మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా(ఎంసీఐ) మాజీ సభ్యుడు డాక్టర్ గుణశేఖర్‌యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. తిరుపతి భవానీనగర్‌లోని ఆయన నివాసం వెంకటగిరి అపార్ట్‌మెంట్స్‌లో తనిఖీలు చేశారు.
గుణశేఖర్ బంధువులు, స్నేహితులు నివసిస్తున్న ఆటోనగర్, ఎంఆర్‌పల్లి ఎల్‌ఎస్‌నగర్, బైరాగిపట్టెడ లోనూ ఐటీ దాడులు జరిగినట్టు తెలిసింది. మొత్తం 27 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. నగదును లెక్కించేందుకు క్యాష్ కౌంటింగ్ మెషీన్, బంగారం తూచేందుకు వెయింగ్ మెషిన్‌ను తీసుకెళ్లారు.

ఆదాయానికి మించి భారీ మొత్తంలో నగదు, నగలు, డాక్యుమెం ట్లు, ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి వరకు ఈ లెక్కింపు కొనసాగింది. పూర్తి వివరా లు బుధవారం తెలుపుతామని ఓ అధికారి వెల్లడించారు.
గుణశేఖర్ మంత్రి నారాయణతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. కాగా, గుణశేఖర్‌యాదవ్ భార్య తిరుపతి రుయా ఆస్పత్రిలో కంటి వైద్యులుగా పని చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోనూ ఐటీ దాడులు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆత్మకూరులోని ఎస్‌బీఐ, ఆంధ్రా, కెనరా బ్యాంకులు, ఎస్‌బీహెచ్‌లతో పాటు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో ఇద్దరు ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోప ణలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. వీటితోపాటు పలు కళాశాలల్లోనూ ఐటీ అధికారులు దాడులు చేశారు.












Click it and Unblock the Notifications