ఆ విషయంలో రోజా ఫస్ట్, తర్వాత చంద్రబాబు కథ, అన్ని లెక్కలు సరిపోతే నగిరి ఫస్ట్ !

ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలు ఎలా ఉన్నా అందరి కళ్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలతో పాటు తెలంగాణ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు సమీపిస్తుండటంతో ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పార్టీల నాయకులు, ప్రజలు టెన్షన్ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు నుంచి, రోజా నగిరి నుంచి పోటీ చెయ్యడంతో ఆ జిల్లా రాజకీయాల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా అందరి కళ్లు నగిరి మీద ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

It is expected that there is a chance that the Nagiri assembly election results will be released first

చిత్తూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల సంఖ్య పరంగా చూస్తే చిత్తూరులో తక్కువగా పోలింగ్ కేంద్రాల సంఖ్య ఉంది. చిత్తూరులో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండటంతో పోటీలో ఏడు మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. అన్ని లెక్కలు పరిశీలిస్తే మొదటి ఫలితం చిత్తూరుదా, లేక నగిరిదా అని అందరూ అంచనాలు వేసుకుంటున్నారు.

అన్ని అనుకూలిస్తే చిత్తూరు జిల్లాలో మొదటి ఫలితాలు వెలువడే నియోజక వర్గం నగిరి అని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని నిమిషాల వ్యవదిలోనే నగిరి, చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నగిరి అసెంబ్లీ నియోజక వర్గం ఫలితాలు మొదట వచ్చే అవకాశం ఉందని తెలిసింది. నగిరి, చిత్తూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురించి అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

It is expected that there is a chance that the Nagiri assembly election results will be released first

చిత్తూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలైన ఈవీఎంల ఓట్ల లెక్కింపు 130 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో కౌంటింగ్ కు సుమారు 25 నిమిషాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడటానికి సాయంత్రం 4 గంటలు పడే అవకాశం ఉందనని అధికారులు అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు సదరు నియోజక వర్గం ఆర్వో ఎన్నిక పత్రం అందజేస్తారు. చిత్తూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చెయ్యడానికి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జూన్ 4వ తేదీ ఉదయం 5.30 గంటలకే సిబ్బందికి టేబుల్ కేటాయింపుల ప్రకియ చేపట్టడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+