వాటర్‌గ్రిడ్: హడ్కో అవార్డు అందుకున్న కెటిఆర్(పిక్చర్స్)
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హడ్కో ఉత్తమ డిజైన్ పురస్కారం అందచేసింది. హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతులమీదుగా తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. 2022కల్లా దేశంలోని ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, అదనంగా మరో నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కూడా తగిన సమయంలో ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.
కార్యక్రమం అనంతరం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వాటర్‌గ్రిడ్ పథకానికి రుణం మంజూరు విషయంలో హడ్కో చాలా సానుకూలంగా ఉందని చెప్పారు. దేశంలో మరో రాష్ట్రం చేపట్టని విధంగా నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా రక్షిత త్రాగునీటిని అందించాలనే బృహత్తర ప్రాజెక్టును ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిందని అన్నారు. భగీరథ తపస్సు వంటి ఈ పథకానికి రూ. 10 వేల కోట్ల రుణంగా అందించాలని హడ్కోను కోరామని చెప్పారు.

వెంకయ్యతో కెటిఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హడ్కో ఉత్తమ డిజైన్ పురస్కారం అందచేసింది.

హడ్కో అవార్డు
హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతులమీదుగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారకరామారావు ఈ అవార్డును అందుకున్నారు.

హడ్కో అవార్డు
ఈ సందర్భంగా హడ్కో ఛైర్మన్ రవికాంత్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా రక్షిత తాగునీటిని అందించాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఆదర్శనీయమని ప్రశంసించారు.

హడ్కో అవార్డు
దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి పథకం తలపెట్టలేదని వ్యాఖ్యానిస్తూ ఈ ప్రాజెక్టు అమలుకు హడ్కో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఈ పథకానికి హడ్కో రుణం అందించే అవకాశం ఉందని తెలిపారు.

హడ్కో అవార్డు
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.10 వేల కోట్లను ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసిందని ఈ విషయంలో త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రకటించారు.

హడ్కో అవార్డు
కార్యక్రమం అనంతరం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వాటర్‌గ్రిడ్ పథకానికి రుణం మంజూరు విషయంలో హడ్కో చాలా సానుకూలంగా ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications