కలకలం: తెలుగు రాష్ట్రాల్లో ఐటి శాఖ దాడులు, వివిధ రంగాల వ్యాపారులే టార్గెట్

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

తెలుగు రాష్ర్టాల్లోని వ్యాపారులపై ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి.రెండు రాష్ర్టాల్లోని వివిధ రంగాల వ్యాపారులపై ఏకకాలంలో ఐటి శాఖ దాడులు నిర్వహిస్తుండటంతో పక్కా ప్రణాళికతోనే ఈ దాడులు జరుగుతున్నట్లు భావిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరంలో 50 మంది రియల్ ఎస్టేట్,మనీ ల్యాండరింగ్, జ్యూయలరీ, హోల్సేల్ వ్యాపారులపై ఈ దాడులు జరిగాయి. ఈ 50 మందిలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది

IT raid: Income Tax raids in telugu states

మరోవైపు హైదరాబాద్ లోను పలువురిపై ఐటి శాఖ దాడులు నిర్వహించింది. హైదరాబాద్లోని జివిఆర్ విద్యాసంస్థ యజమాని, అలాగే మరొక రాజకీయ ప్రముఖుడి అనుచరుల నివాసాలపై ఈ దాడులు జరిగాయి. వీరంతా నోట్ల రద్దు తరువాత అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహించడం, పెద్ద మొత్తాల్లో డబ్బును డిపాజిట్‌ చేసినట్లు సమాచారం. ఆ వివరాలు పక్కాగా తెలుసుకునే ఐటి శాఖ ఈ దాడులు నిర్వహిస్తుందని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి సక్రమంగా అదాయపు పన్ను చెల్లించని వ్యాపారులు, అకౌంట్ల నిర్వహణ సరిగ్గా లేని వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sleuths of the Income Tax department on friday raided on top businessmen belogs to telugu states. The IT teams arrived to bhimavaram in ap and conducted searches at over 50 locations belongs to various businessmen. In Telangana the Income Tax Department, which carried out raids on the gvr education institute owner and one political leader also.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి