వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.కోటి వేతనం వదిలి సివిల్స్ ర్యాంక్: ఆ ఫోటో పెట్టి పవన్ ఆనందం, ఆశ్చర్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో మెరుగైన ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలుపుతూ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

చంద్రబాబుపై పోటీ చేస్తా, ఏటీఎం డబ్బులు ఆయన ఖాతాల్లోకి: విజయసాయి సంచలనంచంద్రబాబుపై పోటీ చేస్తా, ఏటీఎం డబ్బులు ఆయన ఖాతాల్లోకి: విజయసాయి సంచలనం

 పృథ్వీతేజ ఫోటో

పృథ్వీతేజ ఫోటో

ఈ మేరకు సివిల్స్‌లో ర్యాంకు సాధించిన ఓ విద్యార్థిని గతంలో కలుసుకున్న సందర్భంగా తీసిన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫలితాల్లో పృథ్వీ తేజ 24వ ర్యాంకు సాధించాడు. గతంలోను ఐఐటీ జేఈఈలో టాపర్‌గా నిలిచాడని పేర్కొన్నారు.

ఆనందంతో కూడిన పవన్ ఆశ్చర్యం

అప్పుడు ఐఐటీ జేఈఈలో టాపర్‌గా నిలిచిన సమయంలో పృథ్వీని అభినందిస్తున్న ఫోటోను ఉంచారు. సివిల్స్‌లోను పృథ్వీకి 24వ ర్యాంకు రావడం చూసి ఆనందంతో కూడిన ఆశ్చర్యం కలిగిందని పవన్ పేర్కొన్నారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన వారందరికీ ఆల్ ది బెస్ట్.

రూ.కోటి వదులుకొని సివిల్స్ రాసి సాధించాడు

రూ.కోటి వదులుకొని సివిల్స్ రాసి సాధించాడు

ఈ మేరకు ఏపీ, తెలంగాణలలో ర్యాంకులు సాధించిన వారి పేర్లను, వారికి వచ్చిన ర్యాంకులను కూడా పోస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన పృథ్వీ తేజ ఐఐటీ పూర్తి చేసి రూ.కోటి వేతనం అందే ఉద్యోగాన్ని వదులుకొని సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశారు.

ఏపీలో వరుస పర్యటనలు

ఏపీలో వరుస పర్యటనలు

కాగా, పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీ పర్యటన ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ట్విట్టర్‌లో ప్రభుత్వాలను ప్రశ్నించిన, సమస్యలపై స్పందించిన పవన్ అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన రోడ్డెక్కనున్నారు. ఏపీలో వరుసగా పర్యటనలు చేయనున్నారని తెలుస్తోంది.

English summary
'Congratulations!for all the exceptional youth who got selected for civil services. Personally, It’s a pleasant surprise to see Sri. Prudhvi Teja bagging 24th Rank ,whom I had met earlier when he became IIT JEE Topper.All the best to everyone.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X