వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి లో ఐటి క‌ల‌క‌లం : ఆరు న‌గరాల్లో అధికారుల మ‌కాం : వారి లక్ష్యం టిడిపి నేత‌లేనా...!

|
Google Oneindia TeluguNews

ఏపిలో పోలింగ్ తేదీ స‌మీపిస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారం కీల‌క ద‌శ‌కు చేరుకుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఏపిలోని పొలిటి క‌ల్ పార్టీల‌కు..ప్ర‌ధానంగా పోటీలో ఉన్న అభ్య‌ర్దుల‌కు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. ఏపిలో ఈ సారి ఎన్నిక‌ల్లో దేశం లో ఎక్క డా లేని విధంగా డ‌బ్బు ఖ‌ర్చు అవుతుంద‌నే ప్ర‌చారం జాతీయ స్థాయిలో జోరుగా సాగుతోంది. ఇదే స‌మ‌యంలో ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు ఏపిలో మ‌కాం వేసారు..వారి ల‌క్ష్యం ఓవ‌రు..ఏం చేయ‌బోతున్నార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది...

ఏపిలో ఐటి అధికారుల మ‌కాం..

ఏపిలో ఐటి అధికారుల మ‌కాం..

ఎన్నిక‌ల ప్ర‌చారంలో అభ్య‌ర్దులు బిజీగా ఉన్న వేళ కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. క‌డ‌ప జిల్లాలోని మైదుకూరు అసెంబ్లీ నుండి టిడిపి అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్న పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పై ఐ టి దాడులు జ‌రిగాయి. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చం ద్ర‌బాబు సైతం ప్ర‌తీ స‌భ‌లోనూ త‌మ అభ్య‌ర్దుల పై ఐటి దాడులు జ‌రుగుతాయంటూ చెప్పుకొస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం క‌క్ష్య సాధింపులో భాగంగా దాడులు చేయిస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. రాజ‌కీయంగా ఆరోప‌ణ‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. ఏపి కి ఐటి అధికారులు పెద్ద సంఖ్య‌లో రావ‌టం..ఆరు న‌గ‌రాల్లో బృందాల వారీగా మకాం వేసార‌నే స‌మాచారం ఇప్పుడు ఎన్నిక ల స‌మ‌యంలో టెన్ష‌న్ పుట్టిస్తోంది. ఏపిలోని గుంటూరు, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, రాజ‌మండ్రి, విశాఖ‌, నెల్లూరు న‌గ‌రాల్లో అక్క‌డ ప‌ని చేసే ఐటి సిబ్బందికి అద‌నంగా చెన్నై, బెంగుళూరు నుండి ప్ర‌త్యేక బృందాలు వ‌చ్చాయి. దీంతో, ఇప్పుడు వీరి లక్ష్యం ఏంటి..వీరి టార్గెట్ లిస్టులో ఎవ‌రున్నార‌నే చ‌ర్చ మొదలైంది.

ఇసి ప‌రిశీల‌కులు..స్థానిక అధికారుల‌తో భేటీలు..

ఇసి ప‌రిశీల‌కులు..స్థానిక అధికారుల‌తో భేటీలు..

ఏపికి ప్ర‌త్యేకంగా వ‌చ్చిన ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారుల బృందాల్లోని కీల‌క అధికారులు స్థానికంగా ఉన్న ఐటి శాఖ అధికారులతో సుదీర్ఘ భేటీలు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుండి వ‌చ్చిన ఎన్ని క‌ల ప‌రిశీల‌కులు సైతం వీరితో ట‌చ్ లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల వేళ‌..ఏ ప్రాంతంలో ఎక్కువ‌గా న‌గ‌దు ప్ర‌భావం చూపుతోంది..ఎక్క‌డా విచ్చ‌ల విడిగా డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తున్నార‌నే అంశం పై ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు..ఐటి అధికారులు దృష్టి సారించిన‌ట్లు చెబుతున్నారు. ప్ర‌ధానంగా ఏపిలోని కోస్తా జిల్లాల్లో ఎక్కువ మంది ఆర్దికంగా బ‌లం ఉన్న వారు పోటీ లో దిగటం తో అక్క‌డ ఫోకస్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా తూర్పు గోదావ‌రి, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఆర్దికంగా స్థితి మంతులు ప్ర‌ముఖ పార్టీల నుండి బ‌రిలో ఉన్నారు. దీంతో..అక్క‌డ ఐటి అధికారులు పెద్ద ఎత్తున నిఘా పెట్టిన‌ట్లు చెబుతున్నారు.

టీడీపీ మరో్ నేత ఇంట్లో ఐటీ సోదాలు ! నెక్ట్స్ ఎవరూ టీడీపీ నేతల్లో కలవరం!టీడీపీ మరో్ నేత ఇంట్లో ఐటీ సోదాలు ! నెక్ట్స్ ఎవరూ టీడీపీ నేతల్లో కలవరం!

టిడిపి నేత‌లే వారి లక్ష్య‌మా...

టిడిపి నేత‌లే వారి లక్ష్య‌మా...

ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ పార్టీ అభ్య‌ర్దుల‌ను లక్ష్యంగా చేసుకొని కేంద్ర సంస్థ‌లు దాడులు చేస్తాయ‌ని చాలా రోజులు గా టిడిపి నేత‌లు చెబుతూ వ‌స్తున్నారు. అదే విధంగా క‌నిగిరి అభ్య‌ర్ది ఉగ్ర న‌ర‌సింహారెడ్డి, మంత్రి నారాయ‌ణ‌, మైదుకూ రు అభ్య‌ర్ది పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పై ఐటి శాఖ సోదాలు నిర్వ‌హించింది. అయితే, ఈ ముగ్గురు నుండి ఎటువంటి న‌గ దు, ఆధారాలు దొర‌క‌లేద‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఇక‌, అయిదు రోజుల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుం ది. ఈ స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా ఐటి బృందాలు ఏపిలో మ‌కాం వేయ‌టం వెనుక పెద్ద వ్యూహమే ఉంద‌ని అంచ‌నా వేస్తు న్నారు. దీంతో..ఒక వైపు రాజ‌కీయంగా ఎన్నిక‌ల ప్ర‌చారం..ఎల‌క్ష‌న్ మేనేజ్ మెంట్‌..ఇదే స‌మ‌యంలో ఐటి దాడుల భ‌యం అభ్య‌ర్దుల‌ను వెంటాడుతోంది. ఈ నెల 9వ తేదీ లోగా ఏపిలో కీల‌క పరిణామాలు చోటు చేసుకుంటాయ‌నే ప్ర‌చా రం పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.

English summary
Income Tax officials in AP. sources said IT officers selected six cities for rides. Now this news creating new tension for candidates who are in election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X