Chandrababu: నేను మారిపోయా- సాక్ష్యమిదే-కలెక్టర్లతో చంద్రబాబు..!
ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరాక తొలిసారి కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు.. వారికి ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తుచేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవాళ ఉదయం కలెక్టర్ల భేటీ ప్రారంభమయ్యాయ ఆరంభ ప్రసంగం చేసిన చంద్రబాబు తాము ఈ స్థాయికి రావడానికి గత ఐదేళ్లలో ఎలాంటి ఇబ్బందులు పడ్డామో గుర్తుచేశారు. అలాగే మీరూ ఇబ్బందులు పడ్డారంటూ వారికి గుర్తుచేశారు. దీంతో పాటు తాను మారానని మరోసారి బ్యూరోక్రాట్లకు చెప్పుకొచ్చారు.
గత ఐదేళ్లలో ప్రభుత్వం ఒక్క కలెక్టర్ల సదస్సు కూడా నిర్వహించలేదని చంద్రబాబు గుర్తుచేశారు. దీన్ని బట్టి ఆ పాలన ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చన్నారు. ఇకపై మూడు నెలలకోసారి కలెక్టర్ల భేటీ నిర్వహిస్తామన్నారు. అయితే అది గంటల తరబడి ఉండదని కలెక్టర్లకు తెలిపారు. ఇప్పటికే తాను నిర్వహిస్తున్న సమీక్షలు గంట, గంటన్నర మాత్రమే ఉంటున్నాయని, ఇంకా ఆలస్యమైతే తర్వాతి సమీక్షకు వివరాలతో రమ్మని చెప్పి ముగిస్తున్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

కొత్త ప్రభుత్వం వచ్చాక తాను ప్రసంగాలతో ఎక్కువ సమయం వృథా చేయడం లేదన్నారు. ఇకపై కలెక్టర్ల భేటీలు కూడా అలాగే ఉంటాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మూడు నెలలకోసారి కలెక్టర్లు అందరి పనితీరు మదించి సరైన అధికారిని సరైన చోట వాడుకుంటామన్నారు. అలాగే తన పనితీరును కూడా మదింపు చేసుకొంటానన్నారు. తద్వారా ఎవరూ మదింపుకు అతీతం కాదని చెప్పేశారు. ఇప్పటికే చంద్రబాబు అంటే అధికారులకు గుర్తుకొచ్చే సుదీర్ఘ సమీక్షలు, ప్రసంగాలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్దమైనట్లు తాజా వ్యాఖ్యలు మరోసారి నిరూపించాయి.












Click it and Unblock the Notifications