జేసీ, లగడపాటి, కేశినేని పేర్లు చెప్పి బాబును టార్గెట్ చేసిన ఐవైఆర్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మాజీ సీఎస్, తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి సస్పెన్షన్‌కు గురైన ఐవైఆర్ రామకృష్ణారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అడిగి ఉంటే తన ఫేస్‌బుక్ పోస్టులపై వివరణ ఇచ్చేవాడినని ఆయన చెప్పారు. వివరణ ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు.

బాబుకు పక్కలో బల్లెంలా!: ఏరి కోరి ఇచ్చినందుకు ధిక్కారం

సీఎంకు తాను జవాబుదారితనం లేకుండా వ్యవహరించాననడం సరికాదని అన్నారు. తాను 6నెలల నుంచి సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా.. ఇవ్వడం లేదని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఇది తనను చాలా బాధకు గురిచేసిందన్నారు. ఐదు నిమిషాలో, అరగంట సమయం ఇవ్వమని కోరినా ఇవ్వలేదని చెప్పారు. ఆయనకు ఏమైనా భజన చేయాలా? అని ప్రశ్నించారు.

తనకు ఎవరెవరి నుంచో ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. బ్రాహ్మణ కొర్పొరేషన్ పదవి తాను అడిగి తీసుకున్నానని చెప్పారు. తన విజ్ఞప్తికి ఒప్పుకుని ఆ పదవి ఇచ్చారని చెప్పారు. ఫేస్‌బుక్ పోస్టులంటూ తనపై పెద్ద అభాండం వేశారని అన్నారు. సమావేశాలపై తాను అందరికీ సమాచారం ఇచ్చినా.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమకు సమాచారం అందడం లేదని చెప్పడం సరికాదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారం అందుతుందనడంలో వాస్తవం లేదన్నారు.

ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశమే లేదు

ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశమే లేదు

తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశమే లేదని కృష్ణారావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. తనకు అంత అర్థ బలం, అంగ బలం లేదని చెప్పారు. ఆ పదవుల కోసం పోస్టులు పెడతానా? అని ప్రశ్నించారు.

తప్పు చేయలేదు

తప్పు చేయలేదు

తాను ఇవాళ్టి వరకు ఏ తప్పు చేయలేదని కృష్ణారావు అన్నారు. తాను బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జీతం తీసుకోకుండా పని చేశానని చెప్పారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను సరిగ్గా నడపడం, బ్రాహ్మణులకు మేలు చేయడమే తన ధ్యేయమని తెలిపారు.

జేసీ, నానిపై చర్యలు తీసుకోరా?

జేసీ, నానిపై చర్యలు తీసుకోరా?

ఏం తప్పు చేశానని తనను సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
ఏం తప్పు చేశానని నన్ను సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదు. సీఎం చంద్రబాబుపై ఆ పార్టీ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నానిలు ఆరోపణలు చేసినప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఎంపీలు వచ్చినప్పుడు గంట సేపైనా విమానాశ్రయాల్లో విమానాలు ఆగాల్సిందేనని ఓ వ్యక్తి పోస్టు పెడితే.. దానికి కౌంటర్ గా తాను పోస్టు పెట్టానని తెలిపారు. మీకు బుద్ధి ఉందా? అని అతడిపై మండిపడినట్లు చెప్పారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిలే జాతీయ నేతలమని చెప్పుకునే వారు కూడా వ్యవహరించడం సరికాదన్నారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వంపై సెటైర్లు వేశాడని రవికిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంపైనా కృష్ణారావు తీవ్రంగా మండిపడ్డారు. మనమేమైనా ఫాసిస్టు ప్రభుత్వంలో ఉన్నామా? అని నిలదీశారు. పొలిటికల్ సెటైర్లు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్ట్ చేస్తారా? అని ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు.

గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఎందుకు?

గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఎందుకు?

తనకు వచ్చిన నాలుగు పోస్టులను మాత్రమే ఫేస్‌బుక్‌లో తాను షేర్ చేశానని ఆయన తెలిపారు. వారం నుంచే ఈ పోస్టులు చేసినట్లు తెలిపారు. అంతకుముందు గానీ, ఆ తర్వాత గానీ ఎలాంటి పోస్టులు చేయలేదని కృష్ణారావు స్పష్టం చేశారు.

చరిత్రను వక్రీకరించి తీసిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకించానని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. బాహుబలికి కూడా పన్ను ఇవ్వవద్దనే చెప్పానని తెలిపారు.

టీటీడీ ఈఓ పదవిని అనిల్ సింఘాల్‌కు ఇవ్వడాన్ని తాను ప్రశ్నించానని అన్నారు. ఇది ఉత్తర, దక్షిణ భారత విషయం కాదని, దక్షణ భారతదేశంలో సమర్థులైన అధికారులున్నప్పుడు వేరే వారికి ఆ బాధ్యతలను ఎలా కట్టబెడతారని ప్రశ్నించినట్లు కృష్ణారావు చెప్పారు. తెలుగువారిని కాకుండా వేరే వ్యక్తిని ఎందుకు నియమించారో చెప్పాలని ప్రశ్నించారు.

పథకం ప్రకారమే: రిజైన్ చేయమంటే చేసేవాడ్ని..

పథకం ప్రకారమే: రిజైన్ చేయమంటే చేసేవాడ్ని..

పథకం ప్రకారమే తనను తొలగించారని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకే తనను తొలగించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికే తనను కొందరు టీడీపీ కమ్యూనిటికే జీవితం అంకితం చేశావా? అని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఆంధ్రా ప్రజలకు నిజాలు తెలియాలని అన్నారు. ఇందుకు మీడియా సమర్థవంతంగా పనిచేయాలని కోరారు.

బ్రాహ్మణ కార్పొరేషన్ పదవికి తనను రాజీనామా చేయమంటే చేసేవాడినని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. కానీ, ప్రభుత్వం తనను ఈ విధంగా వివరణ కోరకుండానే సస్పెండ్ చేయడం సరికాదన్నారు. తాను ప్రభుత్వానికి పంపిన ఫైళ్లు తిరిగిరాని సందర్భాలెన్నో ఉన్నాయని చెప్పారు. తాను ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయదల్చుకోలేదని, తదుపరి సమావేశంలో పూర్తిగా మాట్లాడతానని చెప్పారు.

 బాబు లగడపాటిని కలిస్తే తప్పులేదా?

బాబు లగడపాటిని కలిస్తే తప్పులేదా?

చంద్రబాబునాయుడు.. కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెడ్డిని కలిస్తే తప్పులేదు కానీ.. తాను స్థానిక ఎమ్మెల్యే రఘుపతిని కలిస్తే తప్పవుతుందా? అని ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేసిన ఆదేశాలు తనకు ఇప్పటి వరకు అందలేదని, అందిన తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IYR Krishna Rao responded on his facebook posts issue on Tuesday.
Please Wait while comments are loading...