'కావాలనే విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం నిర్లక్ష్యం, రాజకీయాలకు అతీతంగా పోరాటం'
అమరావతి: విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని, జోన్ సాధనా దిశగా పోరాడానికి సిద్ధమని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ రైల్వే జోన్ అన్నారు. దానిని సాకారం చేసేందుకు కలిసి పోరాడుదామన్నారు.
రాజకీయాలకు అతీతంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా పోరాడేందుకు అన్ని వర్గాలతో కలిసి ఉద్యమం నిర్మించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. గంటా ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన సమావేశంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

విభజనలో భాగంగా రైల్వే జోన్ హామీ నెరవేరుతుందని భావిస్తే, దానిని కేంద్రం ఆలస్యం చేస్తోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. రైల్వే జోన్ సాధన పోరాటం దిశగా కీలకమైన ముందడుగు పడిందని ఈ సందర్భంగా గంటా అన్నారు.
రాజకీయేతర జేఏసీ జోన్ కోసం పోరాటం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పోరాటంలో పాల్గొనేందుకు ముందుకు రావాలన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications