రాబోయే రోజుల్లో ఇలా - మూడేళ్ల పాలన పూరయిన వేళ : సీఎం జగన్ హామీ..!!

జగన్ అనే నేను..అంటూ సరిగ్గా మూడేళ్ల క్రితం ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సంక్షేమం - సామాజిక న్యాయం అస్త్రాలుగా ముందుడుగు వేసారు. 2024 ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మూడేళ్ల పాలన పూర్తయిన వేళ పార్టీ నేతలు వేడుకలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్య కార్యాలయంలో సీనియర్ నేతలు కేక్ కట్ చేసి మూడేళ్లలో సాధించిన విజయాలను వివరిస్తున్నారు. నేను విన్నాను.. నేను ఉన్నానంటూ ప్రజల్లోకి వచ్చిన జగన్‌కు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు.

Recommended Video

    Pegasus: TDP, Chandrababu పై Mamata Banerjee సంచలనం YS Jagan పై నిఘా | Oneindia Telugu

    151 అసెంబ్లీ, 22 లోక్‌సభ సీట్లను కట్టబెట్టి.. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే సువర్ణ విజయాన్ని వైయస్‌ జగన్‌ ఖాతాలో వేశారంటూ గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ తన మూడేళ్ల పాలన..భవిష్యత్ పైన ట్వీట్ చేసారు. అందులో.. మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆకాక్షించారు.

    Jagan assured the people for best services in coming days, CM Tweet over three years governance

    మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర పూర్తి చేసిన మంత్రులు తమ జిల్లాల్లో జరుగుతున్న మూడేళ్ల పాలన వేడుకల్లో పాల్గొంటున్నారు. అటు టీడీపీ ఇప్పుడు 2024 ఎన్నికలే లక్ష్యంటా..సీఎం జగన్ టార్గెట్ గా అడుగులు వేస్తోంది. సీఎం జగన్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా తాను చేసిన సంక్షేమం మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తూ.. కొత్త వ్యూహాలతో అడుగులు ముందుకు వేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+