నేడు అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరు కానున్న జగన్
Recommended Video
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కానున్నారు. సిబిఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లు, ఈ డి వేసిన 5 అభియోగ పత్రాల పై విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ నేడు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరవుతున్నారు. సీఎం అయిన తర్వాత అక్రమాస్తుల కేసులో జగన్ విచారణకు హాజరు కానుండటం ఇది రెండోసారి.
ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి పదిన్నర గంటలకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి చేరుకుంటారు. విచారణ పూర్తి చేసుకున్న తర్వాత 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి తిరిగి ప్రయాణం అవుతారు సీఎం జగన్ . వ్యక్తి గత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వేసిన పిటీషన్లను కొట్టివేసిన సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం జగన్ తెలంగాణా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ నెల 12న తదుపరి విచారణ జరగనుంది.

ఈ నేపధ్యంలో నేడు కూడా ఆబ్సెంట్ పిటీషన్ దాఖలు చేస్తారని, సీఎం జగన్ కోర్టుకు వెళ్ళరు అని అంతా భావిస్తే అందుకు భిన్నంగా ఆయన నేడు సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఇక దీంతో నేడు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తలపెట్టిన 'దిశ' పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకున్నారు. శుక్రవారం ఈడీ కేసులో కోర్టుకు జగన్ హాజరవ్వాల్సి ఉండడంతో.. ఈ కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేసినట్లు డీజీపీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications