జగన్ బెయిల్ పిటిషన్: టైంకోరిన సిబిఐ, 18కి వాయిదా

దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు సిబిఐకి కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. దీంతో సిబిఐ ఈ రోజు కోర్టు ఎదుట హాజరై తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరింది. ఈ నెల 16న లేదా 17వ తేదిన కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపింది. దీంతో, కోర్టు విచారణను 18వ తేదికి వాయిదా వేసింది.
మరోవైపు, జగన్ ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన విచారణనను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తనకు చికిత్స కోసం బెయిల్ మంజూరు చేయాలని మోపిదేవి పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, జగన్ ఆస్తుల కేసులో సిబిఐ బుధవారం మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరో మూడు ఛార్జీషీట్లతో కలిపి తుది ఛార్జీషీటును ఈ నెల 14న దాఖలు చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications