భారీవర్షంలోనే జగన్ టూర్..! జనంలో భారీ రెస్పాన్స్..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ చేపట్టిన పర్యటన కొనసాగుతోంది. ఉదయం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్.. అనంతరం నగరంలో పర్యటిస్తున్నారు. జగన్ రాకతో వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఎయిర్ పోర్టు నుంచి అడుగడుగునా స్వాగతం పలికాయి. జగన్ రాకతో విశాఖ రోడ్లు జన సంద్రంగా మారాయి. వైసీపీ అధినేతను చూసేందుకు వైసీపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎగబడ్డారు.

జగన్ పర్యటన నేపథ్యంలో విశాఖ రూడ్లపై భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. జగన్ తో పాటు వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో భారీ వర్షం కూడా కురిసింది. దీంతో భారీ వర్షంలోనే జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ సాయంత్రం కల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కు వెళ్లి జగన్ పరిశీలించనున్నారు. అలాగే కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్ధుల్ని పరామర్శిస్తారు.

Jagan braves heavy rain in Vizag assures steel plant workers on privatization

జగన్ టూర్ సందర్భంగా పోలీసులు ముందుగానే భారీ ఆంక్షలు పెట్టారు. అయినా ఇవాళ భారీగా జనం తరలివచ్చారు. ఉదయం నుంచే వైసీపీ నేతల్ని పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సహా ఇతర నేతల్ని జగన్ టూర్ తో పాటు అనుమతించలేదు. దీంతో కాసేపు వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా అనుమతించకపోవడంతో వెనుదిరిగారు.

Jagan braves heavy rain in Vizag assures steel plant workers on privatization

జగన్ మెడికల్ కాలేజీలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తాను స్వయంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తున్నారు. దీంతో జగన్ టూర్ కు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి. టీడీపీ ప్రోత్సాహంతోనే దళిత సంఘాలు నిరసనలు చేస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+