వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: శంకరనారాయణ విచారణకు అనుమతి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో రఘురాం (భారతి) సిమెంట్స్ వ్యవహారంలో నిందితుడైన గనుల శాఖ సహాయ డైరెక్టర్ శంకరనారాయణ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జగన్ అస్తుల కేసులో రఘురాం సిమెంట్స్ లీజుల మంజూరులో కడప జిల్లా ఎర్రగుంట్ల గనుల శాఖ సహాయ డైరెక్టర్ హోదాలో శంకరనారాయణ అక్రమాలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 (2) రెడ్‌విత్ 13 (1)(డి) కింద సిబిఐ అభియోగాలు మోపింది.

సిబిఐ మోపిన అభియోగాలపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అ అనుమతిని పరిశీలించిన సిబిఐ కోర్టు అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న అభియోగాలపై విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుని సమన్లు జారీ చేసింది. జులై 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Jagan case: permission to prosecute Shankaranarayana

కడప జిల్లా టి. సుకేశుల మండలంలో 2037 ఎకరాల్లో ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ పునరుద్ధరణ కోసం గుజరాత్ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించడంలో గనుల శాఖ నిబంధనలను అతిక్రమించారని సిబిఐ అభియోగ పత్రంలో చెప్పింది.

వైయస్ జగన్, జెజె రెడ్డిలతో కలిసి కుట్రలో భాగస్వామిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి గనుల శాఖ నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగా రఘురాం సిమెంట్స్, సరస్వతి పవర్ లిమిటెడ్ దరఖాస్తులు చేసుకున్ాయి. ఈ రెండు కూడా జగన్‌కు చెందిన కంపెనీలే. ఇందులో రఘురాం సిమెంట్స్‌కు మైనింగ్ లీజు మంజూరు చేయాలని, సరస్వతి పవర్ లిమిటెడ్ దరఖాస్తును తిరస్కరించాలని శంకరనారాయణ సిఫార్సు చేశారు.

English summary
Government has allowed to prosecute Shankaranarayana in YSR Congress president YS Jagan DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X