ఎన్నికలు ఎప్పుడో తేల్చేసిన జగన్: వరస్ట్ పర్ఫామెన్స్ జాబితాలో ఆ ఎమ్మెల్యేలు.. కిం కర్తవ్యం!!
ఏపీలో ముందస్తు ఎన్నికలపై జగన్ క్లారిటీ ఇచ్చారు. పనితీరు సరిగ్గా లేని ఆ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రచారం జరుగుతున్న వేళ, ముఖ్యంగా టీడీపీ ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతున్న సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎన్నికలకు ఇంకా 14 నెలలే ఉందని, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు హితబోధ చేశారు.

ఆ ఎమ్మెల్యేలకు జగన్ సీరియస్ క్లాస్
ఇక ఇదే సమయంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కొందరు ఎమ్మెల్యేలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆషామాషీగా నిర్వహిస్తే ఊరుకోబోనని కుండబద్దలు కొట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి, అసలు కార్యక్రమంలో తిరగని వాళ్లకు తక్కువ రోజులు తిరిగిన వాళ్లకు క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉదయభాను, వసంత కృష్ణ ప్రసాద్ వంటి కొందరు నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

వరస్ట్ పెర్ఫార్మెన్స్ జాబితాలో 20 నుండి 30 మంది ఎమ్మెల్యేలు
వరస్ట్ పర్ఫార్మెన్స్ జాబితాలో 20 నుండి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా పేర్కొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే కొత్త వారికి అవకాశం కల్పిస్తానని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు సమాచారం. ఇక ఇదే విషయాన్ని మంత్రి కొడాలి నాని కూడా స్పష్టం చేశారు. తమపై నిఘా ఉన్నట్టు, సీఎం జగన్ తనలాంటి వాళ్లకు క్లాస్ పీకినట్టు మీడియా ముఖంగా కూడా వెల్లడించారు.

ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లకుండా మొహం చాటేస్తున్నారని ఆగ్రహం
వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలని, పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని, తాము అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అప్పుడే ప్రజల నుండి మద్దతు దొరుకుతుందని జగన్ శత విధాలా ప్రయత్నం చేస్తుంటే, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు దాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా అందరికీ సీరియస్ గా మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లకుండా మొహం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ పరిస్థితిని అర్ధం చేసుకోవాలన్నారు.

మార్చి 18వ తేదీ నుండి 'మా భవిష్యత్తు నువ్వే జగన్' కార్యక్రమం
తెలుగుదేశం పార్టీతో కలిసి కొన్ని మీడియా సంస్థలు ఉన్నవి లేనట్టుగా చిత్రీకరిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. టిడిపి నేతలు ప్రజలకు నిరంతరం ఏదో భ్రమలు కల్పించే పనులు చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇక మార్చి 18వ తేదీ నుండి 'మా భవిష్యత్తు నువ్వే జగన్' కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈలోగా కన్వీనర్లు, గృహసారధులకు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న వేళ ఇంకా 14 నెలలు ఎన్నికలకు సమయం ఉందని చెప్పిన జగన్, ఎన్నికలపై స్పష్టమైన విధానాన్ని పార్టీ నేతలకు వెల్లడించారు. మరి జగన్ హెచ్చరికలతో అయినా ఎమ్మెల్యేలు మారతారా? వారి కిం కర్తవ్యం ఏమిటి? అన్నది చర్చ జరుగుతుంది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications