అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పై కొడాలి నాని, నానిపై జగన్ అసంతృప్తి?

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా? తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకోవ‌డంలేద‌ని భావిస్తున్నారా? తాను నానికి ప్ర‌త్యేక ప్రాధాన్య‌తనిస్తున్న‌ప్ప‌టికీ దాన్ని కొడాలి స‌ద్వినియోగం చేసుకోవడంలేదా? అనే విషయాల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నాని తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

పదవులుండవని ముందుగానే చెప్పాం!

పదవులుండవని ముందుగానే చెప్పాం!

క్యాబినెట్ ప‌ద‌వులు రెండున్న‌ర సంవ‌త్స‌రాలు పూర్త‌వ‌గానే అంద‌రినీ మార్చేస్తాన‌ని ముందే జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అందుకు త‌గ్గ‌ట్లుగా మాన‌సికంగా వీరంతా సిద్ధ‌మై ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఒక‌వేళ మంత్రి ప‌ద‌వి పోయింద‌నే భావ‌న‌తో నాని అసంతృప్తిగా ఉన్నారా? అనే ఆలోచ‌న పార్టీ వర్గాల్లో నెలకొంది. కానీ ముందుగానే పదవుల నుంచి తొలగిస్తామని చెప్పడంతో ఎటువంటి అసంతృప్తి లేదని నాని సన్నిహితులు చెబుతున్నారు.

ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ పేరును పెట్టిన ప్రభుత్వం!

ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ పేరును పెట్టిన ప్రభుత్వం!


జగన్ ప్ర‌భుత్వం ఎన్టీఆర్ పేరును ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం నుంచి తొల‌గించి వైఎస్ పేరును పెట్టారు. దీనిపై రాష్ట్ర‌వ్యాప్తంగా దుమారం రేపింది. వైసీపీలోను తీవ్ర‌స్థాయి అసంతృప్తి వ్య‌క్త‌మైన‌ప్ప‌టికీ ఎవ‌రూ బ‌య‌ట‌ప‌డ‌లేదు. అయితే కొడాలి నాని ప్రాతినిధ్యం వ‌హించేది ఎన్టీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతోపాటు ఆయ‌న‌కు ప‌డే ఓట్ల‌లో అధిక శాతం ఎన్టీఆర్ అభిమానులే ఉంటారు. ఇప్పుడు ఈ నిర్ణ‌యంపై ఎక్క‌డా మీడియాతో కొడాలి మాట్లాడ‌లేదు. తన నిర్ణయాన్నికానీ, పార్టీ నిర్ణయాన్ని కానీ ఆయన బహిరంగంగా ఎక్కడా వ్యక్తపరచలేదు.

స్పందించాలంటూ కొడాలి నానిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి?

స్పందించాలంటూ కొడాలి నానిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి?

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు విషయమై స్పందించాలంటూ ప‌లువురి నుంచి నానిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి వ‌చ్చిందికానీ ఆయ‌న బ‌య‌ట ప‌డ‌లేదు.అంతర్గతంగా మాత్రం కొడాలి ముఖ్యమంత్రి తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. పేరు మార్పు వ్య‌వ‌హారంపై యార్ల‌గ‌డ్డ‌లాంటివారు త‌మ ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించారు. కానీ వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌పై ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచారు. ల‌క్ష్మీపార్వ‌తి కూడా అంతే. పేరు మార్చ‌డం స‌రైన‌దే అన్నారు. ఆ సందర్భంలో కూడా నాని బయట పడలేదు. మీడియాతో కూడా ఈ విష‌య‌మై ఎక్క‌డా మాట్లాడ‌లేదు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్ పై కొడాలి నాని, కొడాలి నానిపై జగన్ ఇద్దరూ తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. తర్వాత ఈ విషయం ఎన్ని మలుపులు తిరుగుతుందనేది కాలమే నిర్ణయించనుంది.

English summary
Is Chief Minister Jaganmohan Reddy unhappy with former minister, Gudivada MLA Kodali Nani?Do you think that he is not taking our government's program seriously, which he considered prestigious?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X