YS Jagan : బొగ్గు కొరత అధిగమించండిలా- మీటర్లపై రైతులకు లేఖలు రాయండి-జగన్ ఆదేశం..

విద్యుత్ శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంపై పూర్తిస్థాయి సమీక్ష చేపట్టారు. గడిచిన వేసవికాలంలో డిమాండ్, సప్లైపై గణాంకాలు తెలుసుకున్న జగన్... దేశంలో బొగ్గు కొరత నేపథ్యంలో ధర్మల్ కేంద్రాల వద్ద నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. అలాగే ఎప్పటికప్పుడు పరిస్ధితి సమీక్షించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ మీటర్లపైనా రైతుల్ని ఒప్పించేందుకు పలు సూచనలు చేశారు.

విద్యుత్ తాజా పరిస్దితి ఇదే..

విద్యుత్ తాజా పరిస్దితి ఇదే..

దేశవ్యాప్తంగా విద్యుత్‌కొరత ఉన్న రోజుల్లో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీగా విద్యుత్‌ కొనుగోలు చేసినట్టుగా ఇవాళ సీఎం నిర్వహించిన సమీక్షలో అధికారులు వివరించారు. ఈ ఏడాది మార్చిలో 1268.7 మిలియన్‌ యూనిట్ లకోసం రూ.1123.7 కోట్లు ఖర్చు చేశామని, ఏప్రిల్‌ నెలలో 1047.8 మిలియన్‌ యూనిట్లకోసం రూ. 1022.4 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు.

మే నెలలో 739.72 మిలియన్‌ యూనిట్లకోసం రూ.832.92కోట్లు ఖర్చు పెట్టినట్లు,జూన్‌నెలలో 936.22 మిలియన్‌ యూనిట్లకోసం రూ. 745.75 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. జులై 25 వరకూ 180.96 మిలియన్‌ యూనిట్ల కోసం రూ.125.95 కోట్లు ఖర్చు చేశామన్నారు. అలాగే కృష్ణపట్నం విద్యుత్‌ ప్లాంట్‌ యూనిట్‌-3 నుంచి సెప్టెంబరు-2022 నుంచి విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని వారు సీఎంకు తెలిపారు. విజయవాడ ధర్మల్‌ ప్లాంట్‌ ఐదవ స్టేజ్‌ వచ్చే ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు.

ఈ రెండు యూనిట్ల ద్వారా అదనంగా 1600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందన్నారు.ఏటా విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నా, దానికి సరిపడా బొగ్గు.. సరఫరా కేంద్రం నుంచి ఉండటం లేదని అధికారులు సీఎంకు వివరించారు.

 బొగ్గు సరఫరాలో లోటు

బొగ్గు సరఫరాలో లోటు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత, ధర్మల్ ‌కేంద్రాలపై ప్రభావంపై అధికారులతో సీఎం చర్చించారు. ఏటా ఈ గ్యాప్‌ పెరుగుతోందని అధికారులు ఆయనకు తెలిపారు. 2019-20లో 26.85 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు సరఫరాకు లింకేజి చేసుకుంటే...20.84 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు వచ్చిందని, అంటే 77.62శాతమే వచ్చిందని వివరించారు.

2020-21లో 25.38 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకోసం లింకేజి చేసుకుంటే 10.51 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చిందని, 31.14 శాతం మాత్రమే సరఫరా చేశారని తెలిపారు. 2021-22లో 25.38 మిలియన్‌ మెట్రిక్‌టన్నులు కావాలని అడిగితే 18.12 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చిందని 71.40 శాతం మాత్రమే బొగ్గు వచ్చిందని వివరించారు.

అధికారులకు జగన్ ఆదేశాలివే

అధికారులకు జగన్ ఆదేశాలివే

బొగ్గు కొరతపై స్పందించిన జగన్.. థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికోసం సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉండే రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలన్నారు.

దీనివల్ల ఒత్తిడి తగ్గి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయవచ్చన్నారు. డిమాండ్‌ అధికంగా ఉన్న రోజుల్లో కూడా పరిశ్రమలకు ఇబ్బందిలేకుండా విద్యుత్‌ సరఫరాపై సరైన ప్రణాళికను అనుసరించాలని కూడా జగన్ ఆదేశించారు. కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై జరిగేలా చూసుకోవాలన్నారు. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.

కృష్ణపట్నం పోర్టు రేవు దగ్గరే విద్యుత్‌ ప్లాంట్‌ ఉంది కాబట్టి ఓడలద్వారా తెప్పించుకునే బొగ్గు ద్వారా అక్కడ పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా చూడాలని కూడా కోరారు, దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయన్నారు. ఉత్పత్తి ఖర్చు మిగతా వాటితో పోలిస్తే తగ్గుతుందన్నారు. సింగరేణి నుంచి కూడా అవసరమైన బొగ్గు వచ్చేలా అక్కడి యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలన్నారు. కోల్‌స్వాపింగ్‌ లాంటి వినూత్న ఆలోచనలు కూడా చేయాలని జగన్ సూచించారు.

మీటర్లపై రైతులకు నచ్చజెప్పమన్న జగన్

మీటర్లపై రైతులకు నచ్చజెప్పమన్న జగన్

పోలవరం విద్యుత్‌ కేంద్ర ప్రాజెక్ట్‌ పనులపైనా సమీక్షించిన సీఎం జగన్ ... పనుల పురోగతిని సీఎంకు వివరించారు.దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మాణాన్ని కూడా 2024 ఏప్రిల్‌నాటికి పూర్తిచేసేదిశగా అడుగులు ముందుకేస్తున్నామన్నారు. ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష చేశారు. డిసెంబరులోగా టెండర్లు ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు.

మరోవైపు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్పాలని జగన్ అధికారుల్ని ఆదేశించారు. దీనిపై రైతులకు లేఖలు రాయాలన్నారు. రైతుపై ఒక్కపైసాకూడా భారంపడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్నికూడా వారికి వివరించమన్నారు.శ్రీకాకుళంలో పైలట్‌ప్రాజెక్ట్‌ ఎలా విజయవంతం అయ్యిందో వివరించమని సూచించారు. 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అక్కడ ఆదా అయిన విషయాన్ని రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు.

మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవని, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందన్నారు. నాణ్యంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందనే విషయాన్ని రైతులకు వివరించమన్నారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేయాలని కూడా సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైనా వెంటనే రీప్లేస్‌ చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+