జేసి ఇలాకాలోకి జ‌గ‌న్‌: నేడు తాడిప‌త్రిలో ప్ర‌చార స‌భ : వైసిపి లోకి జేసి కీల‌క అనుచ‌రులు...!

Recommended Video

    AP Assembly Election 2019 : నేడు జేసి ఇలాకాలోకి జ‌గ‌న్‌ వైసిపి లోకి జేసి కీల‌క అనుచ‌రులు...!

    ఎన్నిక‌ల వేళ అస‌లైన రాజ‌కీయానికి తెర లేచింది. వైసిపి అధినేత జ‌గ‌న్ చాలాకాలం త‌రువాత తాడిప‌త్రిలో కాలు పె డుతున్నారు. జేసి బ్ర‌ద‌ర్స కు కంచుకోట‌గా ఉన్న తాడిప‌త్రి లో ఈసారి జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి సీటు కేటాయించారు. ఇక‌, వైసిపి నుండి కేతిరెడ్డి పెద్దారెడ్డి బ‌రిలో ఉన్నారు. ఆయ‌న కుమారులు ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. ఇక‌, ఎన్నిక‌ల వేళ జేసి కీల‌క అనుచ‌రులు జ‌గ‌న్ స‌మక్షంలో వైసిపి లో చేరుతున్నారు.

    జేసి ఇలాకాలోకి జ‌గ‌న్..

    జేసి ఇలాకాలోకి జ‌గ‌న్..

    ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. వైసిపి అధినేత జ‌గ‌న్ జేసి బ్ర‌ద‌ర్స్ ఇలాకా అయిన తాడిప‌త్రి లో కాలు పెడుతున్నారు. చాలాకాలం త‌రువాత జ‌గ‌న్ ఈ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో జేసి బ్ర‌ద‌ర్స్ పోటీలో లేరు అనంత‌పురం ఎంపీగా జేసి దివాక‌ర్ రెడ్డి కుమారుడు ప‌వ‌న్‌..తాడిప‌త్రి నుండి ప్ర‌భాక‌ర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి బ‌రిలో ఉన్నారు. తాడిప‌త్రి నుండి వైసిపి అభ్య‌ర్ది పెద్దారెడ్డి పోటీలో ఉన్నారు. చాలాకాలంగా జేసి బ్ర‌ద‌ర్స్‌..పెద్దారెడ్డి వ‌ర్గాల మ‌ధ్య ఆధిప త్య పోరు సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం పెద్దారెడ్డి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. దీంతో..ఆయ‌న ఇద్ద‌రు కుమారులు తండ్రి ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకున్నారు. జేసి బ్ర‌ద‌ర్స్ జ‌గ‌న్ తో పాటుగా ఆయ‌న కుటంబ స‌భ్య‌ల‌ను ల‌క్ష్యం గా చేసుకొని తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఎలాగైనా తాడిప‌త్రిలో జెండా ఎగ‌రేయాల‌ని వైసిపి ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

    తాడిప‌త్రి పైనే ఫోకస్‌..

    తాడిప‌త్రి పైనే ఫోకస్‌..

    అనంత‌పురం జిల్లాలో జ‌గ‌న్ తాడిప‌త్రి పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. అనంత‌పురం ఎంపి సీటు గెల‌వాలంటే తాడిప‌త్రి లో గెలవ‌ట‌మే కాదు..ఆక్క‌డ జేసి కుటుంబానికి మెజార్టీ త‌గ్గిస్తే అనంత‌పురం సీటు గెల‌వ‌టం సుల‌భ‌మ‌ని వైసిపి నేత లు భావిస్తున్నారు. ఈ సారి అనంత‌పురం ఎంపి..తాడిప‌త్రి ఎమ్మెల్యే సీట్ల‌లో రెండు పార్టీల నుండి కొత్త అభ్య‌ర్దులే బ‌రి లో ఉన్నారు. బిసి కార్డు తో జేసి బ్ర‌ద‌ర్స్ కు చెక్ పెట్టాల‌నేది జ‌గ‌న్ వ్యూహం. ఇక‌, ఇదే స‌మ‌యంలో జేసి బ్ర‌ద‌ర్స్ కు తాడిప‌త్రి లో కీల‌క మ‌ద్ద‌తు దారులుగా ఉంటూ..మెజార్టీ వ‌చ్చేలా చేయ‌టం లో కీల‌కంగా ఉన్న నేత‌లను వైసిపి ట్రాప్ చేసింది. వారిని జేసికి దూరం చేయ‌టం ద్వారా జేసిని నైతికంగా దెబ్బ తీయాల‌ని భావిస్తున్నారు. తాడిప‌త్రి లో దెబ్బ తీస్తే..అనంత‌పురం అర్బ‌న్‌..క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న వ‌ర్గ విబేధాల కార‌ణంగా అనంత‌పురం ఎంపి సీటు వైసిపి వశం అవుతుంద‌ని జ‌గ‌న్ అంచనా వేస్తున్నారు.

     జ‌గ‌న్ స‌మక్షంలో వైసిపి లోకి జేసి అనుచ‌రులు..

    జ‌గ‌న్ స‌మక్షంలో వైసిపి లోకి జేసి అనుచ‌రులు..

    తాడిప‌త్రి లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న కోసం స్థానిక వైసిపి ఎమ్మెల్యే అభ్య‌ర్ది అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ శ్రేణులు కూడా కదనోత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్, జయచంద్రారెడ్డి, బ్రహ్మానందరెడ్డిలతో పాటు తాడిప త్రి ఎంపీపీ గురులక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు సావిత్రి, కాకర్ల జగన్నాథ్, చిత్తరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రంగనాయకులు, జేసీ స్వగ్రామం జూటూరుకు చెందిన రా మ్మోహన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, మహదేవరెడ్డి, నాగరంగయ్య, ఎంపీటీసీ సభ్యు లు వెంకటనారాయణ, పెద్దయ్య, బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎంపీపీ పుల్లన్న, రామేశ్వరరెడ్డి, ఉమాపతినాయుడు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ఖా జామైనుద్దీన్, లయన్స్‌క్లబ్‌ ప్రెసిడెంట్‌ రోఖియాబేగమ్‌ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. దీంతో తాడిపత్రిలో టీడీపీ ఖాళీ అయినట్లే న‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+