జగన్ సీఎం కావాలని: కడపలో యువకుడి ఆత్మహత్య.. పాదయాత్రకూ వచ్చాడు!

Subscribe to Oneindia Telugu

విజయవాడ: కడప జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా.. పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

  భార్యాభర్తలు ఇంట్లో కాపురం చేసుకుంటున్నా వదలరు : జగన్ పాదయాత్ర పై JC సంచలనం

  ప్రజా మేనిఫెస్టోనే తమ మేనిఫెస్టో అనే రీతిలో ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ అధినేత జగన్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. జగన్‌ను సీఎంగా చూడాలని కలలు కంటున్న కాచన శ్రీనివాసుల రెడ్డి అనే ఓ వ్యక్తి కడప జిల్లా రాజులపాలెం మండలం టంగుటూరులో ఆత్మహత్య చేసుకున్నాడు.

  jagan fan suicide in kadapa district

  సోమవారం టంగుటూరు మెట్ట వద్ద నిర్వహించిన పాదయాత్రలో శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నాడు. రాత్రి ఇంటికి తిరిగి చేరుకున్న అతను.. జగన్ సీఎం కావాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలువురు వైసీపీ నేతలు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించినట్టు సమాచారం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Kachana Srinivasula Reddy, A big fan of Jagan was committed suicide in Kadapa district on Tuesday

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి