Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లు, టెలికాం నెట్ వర్క్-కేంద్రానికి జగన్ సర్కార్ వినతి-తగ్గుతున్న ప్రభావం

ఏపీలో మావోయిస్టుల ప్రభావం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే మావోయిస్టుల సంచారం కనిపిస్తోంది. అలాగే లొంగుబాట్లు కూడా పెరుగుతున్నాయి.. అయినా ఏదో భయం.. మళ్లీ రిక్రూట్ మెంట్లు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు, ఎప్పుడు ఎక్కడ అన్నలు విరుచుకుపడతారమోనన్న భయాలు.. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, టెలికాం నెట్ వర్క్ లు అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని జగన్ సర్కార్ తాజాగా కోరింది. దీంతోపాటు మరికొన్ని కీలక చర్యల్ని కూడా సూచించింది.

 ఏపీలో మావోయిస్టుల ప్రభావం

ఏపీలో మావోయిస్టుల ప్రభావం

ఏపీలో మావోయిస్టుల ప్రభావం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అయినా ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల్లోనూ మావోల ప్రభావం ఉండీ ఉండనట్లుగా ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక్కడి మన్యంలో మావోయిస్టుల కదలికలు ఎప్పుడూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో మావోయిస్టుల్ని ఎదుర్కొనేందుకు ఏఫీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజా పరిస్ధితిని కేంద్రానికి వివరించింది కూడా. తాజాగా కేంద్రం నిర్వహించిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి సీఎం జగన్ కాలు బెణికి వెళ్లలేకపోవడంతో ఆయన స్ధానంలో హోంమంత్రి సుచరిత వెళ్లారు.

 లేదు లేదంటూనే

లేదు లేదంటూనే

ఏపీలో మావోయిస్టుల ప్రభావం నాలుగైదు జిల్లాలకు ఉందని కొంతకాలంగా ప్రభుత్వం చెప్తూ వస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల్లోనే మావోయిస్టుల కదలికలు ఉన్నాయని చెప్పేది. కానీ తాజాగా కేవలం రెండు జిల్లాల్లోనే మావోయిస్టు ప్రభావం ఉందని హోంమంత్రి సుచరిత తాజాగా ప్రకటించారు. దీంతో అసలు రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావంపై ప్రభుత్వానికి సమాచారం ఉందా లేదా అనే చర్చ మొదలైంది. ఒడిశా సరిహద్దుల్లోని ఏవోబీతో పాటు విశాఖ మన్యంలోనూ గతంలో ప్రభుత్వం, పోలీసులు సైలెంట్ గా ఉన్న ప్రతిసారీ మావోయిస్టులు చెలరేగిపోయారు. ఇప్పటికే ఆయా చోట్ల మావోయిస్టుల ముప్పు పొంచి ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది.

 కేంద్రానికి జగన్ సర్కార్ విజ్ఞప్తులు

కేంద్రానికి జగన్ సర్కార్ విజ్ఞప్తులు

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో నక్సల్ కదలికలపై తాజా సమాచారాన్ని కేంద్రంతో పంచుకున్న ఏపీ ప్రభుత్వం.. దీన్ని ఎదుర్కొనేందుకు సహకరించాలని కోరింది. ఇందులో భాగంగా కొన్ని కీలక ప్రతిపాదనలు కూడా చేసింది. నిన్న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో పాల్గొన్న ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత కేంద్రానికి చేసిన ప్రతిపాదనలు చూస్తే రాష్ట్రంలో పరిస్ధితి తీవ్రత ఇట్టే అర్ధమవుతుంది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తరఫున హోంమంత్రి సుచరిత కేంద్రానికి చేసిన ప్రతిపాదనలు ఆసక్తికరంగా ఉన్నాయి.

 రోడ్లు, టెలికాం నెట్ వర్క్ కోరిన ఏపీ

రోడ్లు, టెలికాం నెట్ వర్క్ కోరిన ఏపీ

ఏపీలో మావోయిస్టుల్ని ఎదుర్కొనేందుకు వీలుగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు వేయాలని, టెలికాం నెట్ వర్క్ అభివృద్ధి చేయాలని కేంద్రానికి హోంమంత్రి సుచరిత ప్రతిపాదించారు. వీటితో పాటు మరిన్ని ఏకలవ్య పాఠశాలలు, పోస్టాఫీసులు కూడా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కూడా కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య ఐదు నుంచి రెండుకు తగ్గిందని, ఇప్పుడు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోనే మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సుచరిత ఈ సమావేశం తర్వాత మీడియాకు వెల్లడించారు. అలాగే గతంలో 150 వరకూ ఉన్న మావోయిస్టులు ఇప్పుడు 50కి తగ్గినట్లు ఆమె తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+