వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ap Ration Cards : రేషన్ కార్డుల తొలగింపుపై జగన్ సర్కార్ క్లారిటీ-ఈ-కేవైసీ తప్పనిసరి

|
Google Oneindia TeluguNews

ఏపీలో రేషన్ కార్డులకు ఈ-కేవైసీ వివాదం లబ్దిదారుల్ని కుదిపేస్తోంది. ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు పోతాయంటూ ప్రచారం జరుగుతుండటంతో లబ్ది దారులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ కేవైసీ కోసం పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ-కేవైసీ నమోదు చేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ కోన శశిధర్ తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 10శాతం మంది ఈ - కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. రేషన్ కార్డులు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తమమని కోన శశిధర్ తెలిపారు. అయితే ప్రతీ ఒక్కరూ ఆధార్ డేటాతో ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు.

jagan government clarified e-kyc must for ration cards according to centres direction

ఓసారి ఈ కేవైసీ నమోదు చేయించుకుంటే ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా రేషన్ తీసుకోవచ్చని కోన శశిధర్ తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలకు సెప్టెంబర్ నెలాఖరు వరకూ గడువు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ కేవైసీ నమోదు చేయించుకోవచ్చని శశిధర్ తెలిపారు. అసలు ఆధార్ లో డేటా లేని వాళ్ళు మాత్రమే ఆధార్ కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కేవైసీ నమోదు చేసుకోనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శశిధర్ వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్- వన్ రేషన్ పథకంలో భాగంగా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించింది. కోవిడ్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు సైతం అక్కడ రేషన్ తీసుకునేందుకు వీలు కల్పించింది. దీంతో ఈ కేవైసీకి ప్రాధాన్యం పెరిగింది. అన్ని రాష్ట్రాలూ తమ రాష్ట్రాల్లోని లబ్ది దారులకు ఈ కేవైసీ చేయించాలని కేంద్రం చెబుతోంది. దీంతో రాష్ట్రాలు కూడా దీనిపై దృష్టిపెట్టాయి. కానీ కరోనా కారణంగా ఆధార్ లేని వారికి మాత్రం సమస్యలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టిసారిస్తున్నాయి.

English summary
andhrapradesh government on today made it clear that e-kyc is must for ration cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X