ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు- ఈఆర్సీ నిర్ణయం-ఆగస్టు నుంచి అమలు-కొత్త ఛార్జీలివే
ఏపీలో వేసవి వేళ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీల మోత మోగింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల్ని పెంచుతూ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు 45 పైసల నుంచి రూపాయి 40 పైసల వరకూ పెరగబోతున్నాయి.
ఏపీలో తాజాగా పెరిగిన విద్యుత్ ఛార్జీల ప్రకారం చూస్తే 30 యూనిట్ల వరకూ యూనిట్ కు 45 పైసలు పెరిగింది. అలాగే
31-75 యూనిట్ల వరకూ యూనిట్ కు 91 పైసలు పెరిగింది. 76-125 యూనిట్ల వరకూ యూనిట్ కు 1.40పైసలు పెంపు వర్తింపచేయనున్నారు. 126-225 యూనిట్ల వరకూ రూ.1.57 పెరిగింది. అలాగే 226-400 యూనిట్ల వరకూ 1.16 పెరిగింది. 400 యూనిట్ల పైన ఉంటే మాత్రం యూనిట్ కు 55 పైసలు పెరిగింది. కొత్త ఛార్జీలపై ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జునరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో వేసవిలో వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలకు మంట పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు తప్పలేదని ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి తెలిపారు. ధరల పెంపు బాధాకరమే అన్నారు. ప్రస్తుతం ఉన్న కేటగిరీలను రద్దు చేసి స్లాబ్ ల విధానంలోకి మార్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఆరు స్లాబ్ లుగా విభించారు. ఆ స్లాబ్ ల ఆధారంగానే కొత్త ఛార్జీల్ని అమల్లోకి తెచ్చారు. వీటి ఆధారంగానే ఇకపై ఛార్జీలు వసూలు చేయాలని ఈఆర్సీ డిస్కమ్ లకు సూచించింది.












Click it and Unblock the Notifications