Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజధానుల బిల్లుపై ప్రజాభిప్రాయం ఇలా-స్ధానిక సంస్ధలతోనే-జగన్ ప్రస్తావన అందుకేనా ?

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకున్న వైసీపీ సర్కార్ ఇప్పడేం చేయబోతోంది ? ప్రజా వ్యతిరేకత ఉన్నా మూడు రాజధానులపై ముందడుగు వేస్తోందన్న విమర్శలకు ఎలా చెక్ పెట్టబోతోంది ? ఇందుకోసం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ఏ పద్ధతి ఎంచుకోబోతోంది ? గతంలో జీఎస్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికలే ప్రజాభిప్రాయమని చెప్పిన జగన్ సర్కార్ ఈసారి ఏం చేయబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మూడు రాజధానులు

మూడు రాజధానులు

ప్రభుత్వాలు విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటికి ప్రజా మద్దతు ఉందా లేదా అనే అంశాన్ని ముుందుగానే నిఘా వర్గాలతో పాటు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల నుంచి ఫీడ్ బ్యాక్ రూపంలో తీసుకుంటారు. ఆ తర్వాతే వాటిపై ముందడుగులు వేస్తుంటారు. ఒక్కోసారి వీటికి మించి ప్రజల అభిప్రాయం తీసుకోవాలనుకుంటే మరింత లోతైన అధ్యయనాలు, సర్వేలు, ప్లెబిసైట్ లు కూడా చేయించడం పరిపాటి.

కానీ ఓ నిర్ణయం తీసేసుకుని దాన్ని సమర్ధించుకునేందుకు ఇలా సర్వేలు, అధ్యయనాలు చేయించడం ద్వారా వైసీపీ ప్రభుత్వం గతంలో మూడు రాజధానుల విషయంలో సంచలనం రేపింది. అయితే ఇప్పుడు ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా లేదని భావిస్తూ రాజధానుల కోసం తెచ్చిన బిల్లుల్ని వెనక్కి తీసేసుకుంది. ఇప్పుడు మరోసారి ప్రజాభిప్రాయం తీసుకుని ముందడుగు వేస్తామంటోంది.

రాజధానులపై కొత్త బిల్లు

రాజధానులపై కొత్త బిల్లు

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం గతంలో తీసుకొచ్చిన రెండు బిల్లుల్లోసాంకేతిక లోపాలు ఉండటం, కోర్టుల్లో అవి నిలబడే అవకాశం లేదని తేలిపోవడంతో ప్రభుత్వం ఏదో కారణం చెప్పి వాటిని వెనక్కి తీసుకోక తప్పని పరిస్ధితి నెలకొంది. దీంతో అమరావతిలో ప్రజాభిప్రాయం మూడు రాజధానులకు అనుకూలంగా లేదని, వారిలో కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించాకే తిరిగి సమగ్రంగా కొత్త బిల్లు తీసుకొస్తామని తెలిపింది. అయితే ఈ బిల్లు తీసుకురావడానికి ముందు ప్రభుత్వం చెప్తున్నట్లు మూడు రాజధానులపై అపోహలు ఉన్న అమరావతిలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారా లేక రాష్ట్రమంతా చేపడతారా అన్న దానిపై ఓ సందిగ్ధత నెలకొంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి.

స్ధానిక సంస్ధలతో తీర్మానాలు?

స్ధానిక సంస్ధలతో తీర్మానాలు?

మూడు రాజధానులపై ప్రజాభిప్రాయ సేకరణ నేరుగా ప్రజల్లోకి వెళ్లి చేపడితే అది పూర్తయ్యే సరికి ఈ ప్రభుత్వ పదవీకాలం కూడా పూర్తయిపోతుంది. దీంతో ప్రజలు ఎన్నుకున్న స్ధానిక సంస్ధల కౌన్సిళ్ల నుంచి ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే పన్నులతో పాటు ఇతర అంశాలపై ఇలాగే తీర్మానాలు చేయిస్తోంది. ఇప్పుడు మూడు రాజధానులపైనా అదే వ్యూహం ఎంచుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్ధానిక సంస్ధలతో మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానాలు చేయించి వాటిని ప్రజాభిప్రాయంగా చూపించి కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 పట్టణ, గ్రామ స్ధానిక సంస్ధలతో

పట్టణ, గ్రామ స్ధానిక సంస్ధలతో

పట్టణ స్ధానిక సంస్ధలైన కార్పోరేషన్లు,మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ స్ధానిక సంస్ధలైన పంచాయతీలు, జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లతో మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానాలు చేయించేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకున్న సందర్భంగా సీఎం జగన్ స్ధానిక సంస్ధల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే మూడు రాజధానులకు వెళ్లినట్లు ప్రకటించారు.

దీంతో స్ధానిక సంస్ధల్ని జగనా్ నమ్ముకుంటున్నట్లు అర్ధమవుతోంది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్ధానిక సంస్ధల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఒకటీ అరా మినహాయిస్తే మిగిలిన అన్ని పట్టణ, గ్రామ స్ధానిక సంస్ధలన్నీ అధికార పార్టీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మూడు రాజధానుల అనుకూల తీర్మానాలు చేయించడం అంత కష్టమేమీ కాబోదు. దీంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లీష్ మీడియం తరహాలోనే

ఇంగ్లీష్ మీడియం తరహాలోనే

గతంలో రాష్ట్రంలోని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలుపై తీవ్ర ప్రజావ్యతిరేకత వచ్చింది. విపక్షాలు వ్యతిరేకించాయి. కోర్టుల్లో కేసులు వేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం దాన్ని పట్టించుకోకుండా ముందడుగు వేసింది. చివరికి ఓ దశలో దాన్ని అధిగమించేందుకు రాష్ట్రంలోని స్కూళ్లలో తాము నియమించిన విద్యా కమిటీల సాయంతో తీర్మానాలు చేయించింది.

ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు తాము అనుకూలంగా ఉన్నట్లు, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆయా విద్యా కమిటీలు తీర్మానాలు చేసి పంపాయి. వీటిని ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంలో ప్రదర్శించింది కూడా. తద్వారా విద్యార్ధుల తల్లితండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుతున్నారని చెప్పింది. కానీ కోర్టుల్లో మాత్రం ఆ వ్యవహారం ఇంకా తేలలేదు.

Recommended Video

    3 Capitals Bill : మూడు రాజధానుల బిల్లు రద్దు.. కాసేపట్లో సీఎం జగన్ ప్రకటన! || Oneindia Telugu
     ప్రజాభిప్రాయం వర్సెస్ ప్రభుత్వ ఒప్పందం

    ప్రజాభిప్రాయం వర్సెస్ ప్రభుత్వ ఒప్పందం

    రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్ధానిక సంస్ధలతో తీర్మానాలు చేయించి పంపి వాటినే ప్రజాభిప్రాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే అందుకు కోర్టులు ఒప్పుకుంటాయా లేదా అన్నది మరో చర్చకు తావిస్తోంది. ఎందుకంటే గతంలో ప్రజాభిప్రాయం పేరుతో ప్రభుత్వాలు తీసుకున్న ఎన్నో నిర్ణయాలను కోర్టులు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి.

    ఎందుకంటే కోర్టులకు ప్రజాభిప్రాయంతో పాటు సదరు నిర్ణయానికి ఉన్న చట్టబద్ధత, రాజ్యాంగ బద్ధత కూడా చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రజాభిప్రాయం పేరుతో ప్రతీ నిర్ణయం అమలు చేయడం కుదరదు. ఇక్కడ అమరావతి విషయంలోనూ గతంలో ప్రభుత్వం రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసి ప్రజాభిప్రాయం పేరుతో అమరావతి స్ధానంలో మూడు రాజధానులు తెస్తామంటే హైకోర్టు ఒప్పుకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో ప్రజాభిప్రాయ సేకరణతో పాటు రాజ్యాంగ పరంగా, న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందే.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+