క్యాన్సర్ కేర్ కోసం జగన్ సర్కార్ కీలక ఒప్పందం-హోమీబాబా పరిశోధనా సంస్ధతో

ఏపీలో క్యాన్సర్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సల కోసం వెళ్లే పరిస్ధితులు లేవు. దీంతో జనం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేటు ఆస్పత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ టాటా గ్రూప్ కు చెందిన ప్రతిష్టాత్మక క్యాన్సర్ పరిశోధనా సంస్ధ హోమీబాబా ఇన్ స్టిట్యూట్ తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

మారుమూల ప్రాంతాలకు సైతం క్యాన్సర్ చికిత్సను అందుబాటులో కి తేవాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు తెలిపారు. క్యాన్సర్ కు దారితీసే పొగాకు ఉత్పత్తుల్ని వాడొద్దంటూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నామని ఆయన విశాఖలో వెల్లడించారు. ఇవాళ క్యాన్సర్ డే సందర్భంగా వైజాగ్ ఆర్కే బీచ్ లో జరిగిన వాకథాన్ లో కృష్ణ బాబు పాల్గొన్నారు. హోమీబాబా క్యాన్సర్ పరిశోధనా కేంద్రం, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఈ వాక్ థాన్ నిర్వహించాయి.

jagan government mou with homibaba research centre for cancer care in ap

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం.. క్యాన్సర్ చికిత్సలో సాంకేతిక సహకారం కోసం హోమీబాబా క్యాన్సర్ పరిశోధనా సంస్థ తో ఎంవోయూ కుదుర్చుకుంది. నాలుగైదేళ్లలో ఏపీలో క్యాన్సర్ చికిత్స కు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కృష్ణబాబు తెలిపారు. ఏపీలో కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ ను అందుబాటులో తేవాలన్నదే సీఎం ధ్యేయమని ఆయన వెల్లడించారు. కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ లో ప్రివెన్షన్ , డయగ్నోసిస్ , ట్రీట్మెంట్, పాలియేటివ్ కేర్ ముఖ్యాంశాలని ఆయన పేర్కొన్నారు.

jagan government mou with homibaba research centre for cancer care in ap

రాష్ట్రంలో ప్రతి ఏడాదీ 70 వేల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, దాదాపు 35 వేల మంది వరకూ చనిపోతున్నారని కృష్ణబాబు తెలిపారు. 25శాతం మంది పొగాకు ఉత్పత్తుల్ని వాడడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆయన వెల్లడించారు. క్యాన్సర్ చికిత్స కు ఆరోగ్య శ్రీ కింద దాదాపు 400 కోట్లు ఖర్చు చేస్తున్నామని కృష్ణబాబు తెలిపారు. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నామన్నారు.
"పొగాకు ఉత్పత్తులు వాడొద్దు-క్యాన్సర్ బారిన పడొద్దు" నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. జీవన శైలి లో మార్పులు తీసుకురావడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా బయటపడొచ్చని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+