Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైజాగ్ తరలింపుపై జగన్ సర్కార్ తాజా వ్యూహం ! సుప్రీంకు ఇదే చెప్పబోతున్నారా ?

వైజాగ్ కు ఏపీ రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ కొత్త ప్లాన్ రెడీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో రాజధానుల విచారణ ఆలస్యమవుతున్న నేపథ్యంలో మధ్యే మార్గానికి తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలించే వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా విశాఖలో వచ్చే నెల 3, 4 తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో విశాఖకు వెళ్లబోతున్నట్లు సీఎం జగన్ ఇచ్చిన సంకేతాలు, విశాఖే రాజధానిగా ఉంటుందని, మూడు రాజధానులన్నవి కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనంటూ మంత్రి బుగ్గన ఇచ్చిన సంకేతాల నేపథ్యంలో రేగిన చిచ్చుతో ఇప్పుడు జగన్ సర్కార్ తాజా వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 విశాఖకు రాజధాని తరలింపు

విశాఖకు రాజధాని తరలింపు

ఏపీ రాజధాని విశాఖకు తరలివెళ్తుందా లేదా అని ఉద్యోగులు, సాధారణ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఈ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ తప్పడం లేదు. తాజాగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ సర్కార్ కు విశాఖే రాజధానిగా ఉంటుందా అన్న ప్రశ్న పెట్టుబడిదారుల నుంచి ఎదురవుతోంది. దీంతో సీఎం జగన్, మంత్రి బుగ్గన ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కొత్త వివాదాలకు దారి తీశాయి. దీంతో ఇప్పుడు వాటికి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు.

 జగన్, మంత్రుల ప్రకటనలు

జగన్, మంత్రుల ప్రకటనలు

సుప్రీంకోర్టులో మూడు రాజధానులపై విచారణ సాగుతున్న నేపధ్యంలోనే విశాఖే రాజధాని అంటూ సీఎం జగన్, ఆర్ధిక మంత్రి బుగ్గనతో పాటు పలువురు మంత్రులు వరుస ప్రకటనలు చేస్తున్నారు. కోర్టుల్లో విచారణ సాగుతున్న అంశంపై మాట్లాడకూడదని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఈ ప్రకటనలన్నీ కోర్టు ధిక్కారం కిందకు వస్తాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ పై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ తో పాటు అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ కు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో సుప్రీంకోర్టులో ఈ నెల 23న జరిగే తదుపరి విచారణలో ప్రభుత్వం ఏం చెప్పబోతోందన్నది కీలకంగా మారింది.

 మంత్రుల తలోమాట

మంత్రుల తలోమాట

తాజా పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ నెల 23న జరిగే విచారణ కీలకంగా మారింది. ఓవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని తెలిసినా అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దలు ఒకరి వెంట మరొకరు రాజధానులపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అంతే కాదు ఒకరు విశాఖే రాజధాని అంటే మరొకరు మూడు రాజధానులే ప్రభుత్వ విధానమంటున్నారు. అదేమంటే ప్రభుత్వ విధానమంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోర్టుల్లో విచారణ సాగుతున్న కేసుల్లో ఇలా ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తే తలెత్తే పరిణామాలపై మంత్రుల స్ధాయి వ్యక్తులు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఛైర్మన్ మందలించాల్సి వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వం చెప్పబోయే వాదన వీటన్నింటికీ చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

 జగన్ సర్కార్ తాజా వ్యూహమిదే ?

 జగన్ సర్కార్ తాజా వ్యూహమిదే ?

అయితే వీరి ప్రకటనలు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును దృష్టిలో పెట్టుకుని చేస్తున్నవే అని ఇట్టే అర్ధమవుతోంది. కానీ సుప్రీంకోర్టులో ఈ నెల 23న జరిగే విచారణలో మాత్రం ప్రభుత్వం తమ అసలు వాదన, నిర్ణయం చెప్పక తప్పదు. దీంతో రాజధానులపై సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాఖకు రాజధాని తరలింపు, సీఎం కార్యాలయం తరలింపు వంటి నిర్ణయాలు కూడా సుప్రీంకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని చెప్పేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అంటే తాత్కాలికంగా ఈ నిర్ణయాలు తీసుకున్నా సుప్రీంకోర్టు అంతిమంగా ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం చెప్పబోతోంది. ఈ మేరకు వెసులుబాటు ఇచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+