
పరిషత్ పోరుకు జగన్ పట్టు- కుదరదంటున్న నిమ్మగడ్డ- ప్రివిలేజ్ నోటీసు లీకుల వెనుక ?
ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో ఊపుమీదున్న వైసీపీ... ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరిపి తీరాలని పట్టుబడుతోంది. అయితే ఇందుకు కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నందున ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్ధితుల్లో ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆయన హయాంలోనే ఎన్నికలు ముగించేందుకు వీలైన అన్ని మార్గాలను వైసీపీ అన్వేషిస్తోంది. చివరికి ఆయనపై గతంలో మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి పెట్టిన ప్రివిలేజ్ కమిటీ ఫిర్యాదును కూడా వెలికి తీసి నోటీసులు ఇస్తామని లీకులు ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

పరిషత్ ఎన్నికలు జరపాల్సిందేనని వైసీపీ పట్టు
ఏపీలో
వరుసగా
పంచాయతీ,
మున్సిపల్
ఎన్నికల్లో
ఘన
విజయాలతో
ఊపుమీదున్న
వైసీపీ..
ఇప్పుడు
ఎంపీటీసీ,
జడ్పీటీసీ
ఎన్నికలు
కూడా
జరిగిపోతే
ఆ
తర్వాత
ప్రభుత్వ
పాలనపై
దృష్టిపెట్టాలని
భావిస్తోంది.
అంతే
కాదు
ఎన్నికల
కారణంగా
నత్తనడకన
సాగుతున్న
కరోనా
వ్యాక్సినేషన్
ప్రక్రియను
తిరిగి
గాడిన
పెట్టాలంటే
త్వరగా
ఎన్నికలు
ముగించేయాలని
కోరుకుంటోంది.
దీంతో
సీఎం
జగన్
ఈ
మేరకు
ఎన్నికలు
త్వరగా
జరిగేలా
చూడాలని
అధికారులకు
ఆదేశాలు
ఇచ్చారు.
దీంతో
ఎన్నికలపై
ఎస్ఈసీని
సంప్రదించి
ఈ
ప్రక్రియను
వేగవంతం
చేయాలని
అధికారులు
భావిస్తున్నారు.

పరిషత్ ఎన్నికలపై నిమ్మగడ్డ నిరాసక్తత
ఏపీలో గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నకలను తిరిగి నిర్వహించేందుకు ఓ స్ధాైయి వరకూ ప్రయత్నించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఆ తర్వాత మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో వాయిదా పడిన ఎన్నికలను అక్కడి నుంచే తిరిగి నిర్వహించేందుకు ఎస్ఈసీ చేసిన ప్రయత్నాలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగని కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేదు. మరోవైపు ఈ నెలాఖరున నిమ్మగడ్డ రిటైర్ అవుతున్నారు. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయన సెలవుపై వెళ్తున్నారు. వచ్చాక కూడా ఓ వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ లోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యం. దీంతో పరిషత్ ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ ఆసక్తి చూపడం లేదు.

పరిషత్ పోరుకు నిమ్మగడ్డపై ఒత్తిడి పెంచుతున్న వైసీపీ
ఓవైపు న్యాయవివాదాలు, విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను ఈ నెలాఖరులోపు ముగించడం అసాధ్యంగా భావిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ దీనిపై ఆసక్తి చూపడం లేదు. కానీ వైసీపీ సర్కారు మాత్రం నిమ్మగడ్డ హయాంలోనే పరిషత్ పోరు కూడా ముగించాలని కోరుకుంటోంది. నిమ్మగడ్డ రిటైర్మెంట్ తర్వాత కొత్తగా వచ్చే కమిషనర్ కుదురుకున్నాక ఎన్నికల నిర్వహణకు సమయం పడుతుంది. దీంతో పరిషత్ పోరుకు సిద్ధమైన నిమ్మగడ్డతోనే ఈ ఎన్నికలు జరిపించాలని భావిస్తోంది. అందుకు నిమ్మగడ్డ సిద్ధంగా లేకపోవడంతో ఆయనపై ఒత్తిడి పెంచుతోంది.

నిమ్మగడ్డకు ప్రివిలేజ్ నోటీసుల బెదిరింపుల వెనుక ?
ఎస్ఈసీ నిమ్మగడ్డ తన హయాంలోనే పరిషత్ ఎన్నికల నిర్వహణ జరిపి తీరాలని పట్టుబడుతున్న ప్రభుత్వం ఆయనపై అన్ని మార్గాల్లో ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఆయనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో దాఖలు చేసిన ప్రివిలేజ్ కమిటీ ఫిర్యాదును తిరగతోడుతోంది. గతంలో గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిమ్మగడ్డకు నోటీసులు ఇచ్చేందుకు ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. అయినా నోటీసులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలో ఇస్తామంటూ లీకులు మాత్రం ఇస్తూనే ఉన్నారు. దీంతో ఈ లీకుల వెనుక నిమ్మగడ్డను పరిషత్ పోరుకు ఒప్పించాలన్న పట్టుదలే దాగుందన్న ప్రచారం సాగుతోంది.