Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పీఆర్సీ పోరులో మరో మలుపు-ఉద్యోగ నేతలకు పోలీసు భద్రత- టీచర్ల దాడుల భయంతో ?

ఏపీలో పీఆర్సీ పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపి 23 శాతం పీఆర్సీ ఫిట్ మెంట్ కు ఉద్యోగనేతలు అంగీకరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఉపాధ్యాయులు.. వీరికి వ్యతిరేకంగా కదులుతున్నారు. ఓవైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే మరోవైపు మెరుగైన పీఆర్సీ ఇప్పించడంలో విఫలమైన సాధన సమితి నేతలను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఉద్యోగ నేతలకు పోలీసు భద్రత కల్పించింది.

Recommended Video

    AP PRC: ఉప్పెనలా Chalo Vijayawada ఉద్యోగుల భారీ నిరసన | Andhra Pradesh | Oneindia Telugu
    పీఆర్సీ పోరులో ట్విస్టులు

    పీఆర్సీ పోరులో ట్విస్టులు

    ఏపీలో పీఆర్సీ పోరులో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు తాము సూచించిన విధంగా 23 శాతం పీఆర్సీ ఫిట్ మెంట్ కు అంగీకరించడంతో ఊపిరిపీల్చుకున్న ప్రభుత్వానికి.. ఉఫాధ్యాయుల రూపంలో ప్రతిఘటన ఎదురవుతోంది.

    ముఖ్యంగా పరీక్షల సీజన్ లో ఉపాధ్యాయుల పోరుతో అటు ప్రభుత్వంతో పాటు ఇటు విద్యార్ధులు, ఉద్యోగసంఘాలు కూడా ఇరుకునపడుతున్నాయి. దీంతో ఉపాధ్యాయుల పీఆర్సీ పోరుపై ప్రభుత్వంలో అంతర్గతంగా తీవ్ర మథనం జరుగుతోంది. అలాగే ఉద్యోగులు కూడా తమ నేతలు 23 శాతం పీఆర్సీకి అంగీకరించడంపై ఎదురుతిరిగేలా కనిపిస్తున్నారు.

     సర్కారుకు తలనొప్పి

    సర్కారుకు తలనొప్పి

    పీఆర్సీ ఫిట్ మెంట్ ను 23 శాతంగా ఉద్యోగుల్ని ఒప్పించడంలో సఫలమైన ప్రభుత్వానికి ఇప్పుడు ఉపాధ్యాయుల పోరు తలనొప్పిగా మారుతోంది. పైకి ఉపాధ్యాయుల వెనుక ఎర్ర జెండాలు, పచ్చజెండాలంటూ విమర్శలు చేస్తున్నా అంతిమంగా ఉపాధ్యాయులు పోరుబాట పడితే పడే ప్రభావంపై ప్రభుత్వం వద్ద పక్కా లెక్కలే ఉన్నాయి.

    దీంతో ఉపాధ్యాయుల పోరును తక్కువ అంచనా వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. గతంలో ఉద్యోగులతో వ్యవహరించినట్లుగానే వీరిపైనా ఓవైపు ఎదురుదాడి, మరోవైపు చర్చల మంత్రాన్ని జపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

    ఆత్మరక్షణలో ఉద్యోగ నేతలు

    ఆత్మరక్షణలో ఉద్యోగ నేతలు

    ఉపాధ్యాయుల పోరుతో గతంలో పీఆర్సీ ఫిట్ మెంట్ 23 శాతానికి అంగీకరించిన ఉద్యోగసంఘాల నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో ఇఫ్పుడు వీరు బహిరంగంగా స్వేచ్ఛగా తిరగలేని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఎప్పుడే సమయంలో ఉపాధ్యాయులు తమను నిలదీస్తారో, దాడులు చేస్తారన్న భయంతో ఉద్యోగసంఘాల నేతలు తమ ఆఫీసులకు పరిమితం అవుతున్నారు. లేకుంటే సచివాలయానికి వచ్చి వెళ్తున్నారు. అక్కడ కూడా ఉపాధ్యాయ సంఘాల నుంచి తమకు పోరు తప్పేలా లేదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

     దాడుల భయంతో సర్కార్ భద్రత

    దాడుల భయంతో సర్కార్ భద్రత

    తక్కువ పీఆర్సీ ఫిట్ మెంట్ కు అంగీకరించి ఉద్యమాన్ని నీరుగార్చారంటూ ఉద్యోగసంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ,వెంకట్రామిరెడ్డిపై మండిపడుతున్న ఉపాధ్యాయులు.. వారిపై దాడులకు కూడా దిగొచ్చనే సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. దీంతో ప్రభుత్వం వారికి పోలీసు భద్రత కల్పిస్తోంది.

    ఉద్యోగసంఘాల నేతలు బయట తిరిగేటప్పుడు వారి వాహనాలతో పాటు పోలీసుల్ని కూడా ఎస్కార్టుగా పంపుతోంది.
    అలాగే తాడేపల్లిలోని ఉద్యోగ నేతలు వెంకట్రామిరెడ్డి' బొప్పరాజు నివాసముంటున్న ప్రైమ్ గెలాక్సీ అపార్ట్ మెంట్ వద్ద కూడా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పీఆర్సీ సాధన సమితి నేతల ఇళ్ళముట్టడికి ఉపాద్యాయ సంఘాల పిలుపు నేపథ్యంలో ముందస్తుగా భద్రత కల్పించారు. దీంతో ఉపాధ్యాయుల నుంచి ఉద్యోగ నేతలు ఏ స్ధాయిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారో అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+