వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగుల ఆరోపణల్ని తోసిపుచ్చిన జగన్ సర్కార్, చర్చలు కొనసాగుతాయన్న సీఎస్

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ, హెచ్ఆర్ఏ అంశాల్లో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఉద్యోగులు చేస్తున్న ఆరోపణల్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. అశుతోష్ మిశ్రా కమిటీ ని ప్రభుత్వం ఎక్కడా పక్కన పెట్టలేదని సీఎస్ సమీర్ శర్మ తెలిపారు.
అధికారుల కమిటీ అన్ని అంశాలను శాస్త్రీయంగానే అధ్యయనం చేసిందన్నారు. వ్యక్తిగతంగా సీఎస్ పై ఉద్యోగులు ఆరోపణలు చేయడం సహజమని, కుటుంబంలో పెద్దగా ఉద్యోగుల ఆరోపణలు స్వీకరిస్తానన్నారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని సీఎస్ తెలిపారు. ఇంకా ఉద్యోగులతో చర్చలు చేస్తూనే ఉంటామన్నారు.

తాను 2008-09 లో నేను పీఆర్సీ ప్రక్రియ లో పాల్గొన్నానని, అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ల్లో తేడా వచ్చిందని సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. కరోనా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు తెచ్చిపెట్టిందని, దీంతో రాష్ట్ర రెవెన్యూ గణనీయంగా పడిపోయిందన్నారు. వాస్తవానికి 98 వేల కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉండగా.. అది కాస్తా 62 వేల కోట్లకు పడిపోయిందన్నారు. ఉద్యోగులకు 17000 కోట్లు మధ్యతర భృతి ఇచ్చామని, ఇది వేతనములో భాగం కాదని వారికి తెలుసని సీఎస్ పేర్కొన్నారు. పీఆర్సీ ఆలస్యం అయిన కారణం గా మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. 2019 నుంచి గణించి డీఏలు చెల్లింపు తదితర అంశాలను ప్రకటించామని సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు.

jagan government refused employees allegations over prc, cs hints more discussions

కొన్ని పెరుగుతాయి కొన్ని తగ్గుతాయని, మొత్తం గా వేతనం ఎలా ఉందని చూడాలని ఉద్యోగులకు సూచించారు. అంతే కాని పూర్తిగా ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పెన్షన్ లో, గ్రాట్యుటీ లో కూడా పెరుగుదల ఉందని, కేంద్రం చేసినట్టే ఏపీ కూడా అనుసరించిందని సీఎస్ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కెలు వర్తింప చేస్తున్నామన్నారు. 2020-21 ఆర్ధిక సంవత్సరం లో ద్రవ్యలోటు 54, 370 కోట్లు గా ఉందని, దేశంలో ఏ రాష్ట్రమూ ఉద్యోగ విరమణ వయస్సు ను పెంచలేదని సీఎస్ గుర్తుచేశారు. నియామకాలు ఉండవన్న ఆరోపణలు సరికావవన్నారు. గ్రామ వార్డు సచివాలయంలో 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, అలాగే వైద్యారోగ్య శాఖ లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చామని సమీర్ శర్మ తెలిపారు.

కుటుంబానికి అయినా రాష్ట్రానికి అయినా ఆర్థిక వనరుల వినియోగం ఒకేలా ఉంటుందని, వాటిని పరిమితం గానే వినియోగించుకోవాలి అందులో సవాళ్లు ఉంటాయని ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , ఎస్.ఎస్ రావత్ అన్నారు.
ఉద్యోగులు, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, సంక్షేమం ఇలా అన్ని రంగాలకు ఆర్ధిక వనరులు పంచాలన్నారు.
కోవిడ్ పరిస్థితులల్లో చాలా ప్రభుత్వాలు సంక్షేమ బడ్జెట్ లో కోత పెట్టాయని, తాము మాత్రం సంక్షేమ పధకాల ను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. ఉద్యోగులు ఎవరూ బాధ పడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నామని రావత్ తెలిపారు. విభజన నుంచి కరోనా వరకూ రాష్ట్ర ఆర్ధిక వనరులు ఒడిదుడుకులు లోను అవుతూనే ఉన్నాయని ఆయన వెల్లడించారు. విభజన కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారి పోయిందని, పరిశ్రమలు, సర్వీసుల రంగం ఒడిడుకులకు లోనయ్యిందని ఆయన తెలిపారు. రాజధాని లేని కారణంగా 2015 -20 వరకు 1.80 లక్షల కోట్ల రూపాయల మేర రెవెన్యూ కోల్పోయామని గుర్తుచేశారు.

కోవిడ్ కారణం గా రాష్ట్ర రెవెన్యూ లో రూ.21,933 కోట్ల నష్టం వచ్చిందని ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , ఎస్.ఎస్ రావత్ తెలిపారు. అలాగే కోవిడ్ కోసం అదనంగా 30 వేల కోట్ల రూపాయల వ్యయం చేసామన్నారు. ప్రజలకు అందించే వైద్య ఖర్చు ఉచితంగా ఎవరూ ఇవ్వరు కదా అన్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం ఈ వ్యయం చేసిందన్నారు. పన్నుల ద్వారా ప్రభుత్వానికి 2020-21 లో 60,688 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని, ఇందులో 21,933 కోట్లు ఆదాయం కోల్పోయామన్నారు. మధ్యంతర భృతి తో 3,97,547 మంది ఉద్యోగులకు 11,984 కోట్లు అలాగే 3,57,528 పెన్షనర్ ల కోసం 5,933 కోట్లు ఇచ్చామన్నారు.
కుటుంబం లో ముందుగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశం వస్తుందని, అందుకే సీఎం జగన్ అందరికి ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకున్నారని రావత్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న అంగన్ వాడి వర్కర్లకు గౌరవ వేతనమ్ పెంచారని, సానిటరీ వర్కర్లు, ఆశా వర్కర్లు ఇలా అట్టడుగు స్థాయిలో ఉన్నవారికి 3 వేల నుంచి 10 వేలకు గౌరవ వేతనం పెంచారన్నారు. మొత్తం 3 లక్షల కు పైగా ఉన్న ఇలాంటి వర్కర్లకు ప్రయోజనమ్ కల్పించారని ఆయన గుర్తుచేశారు.
కాంట్రాక్టు ఉద్యోగుల కు మినిమమ్ టైమ్ స్కెలు అమలు చేయడం ద్వారా 360 కోట్లు ఆదనపు భారం పడుతుందని,
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 5,380 కోట్లు వేతనం గా చెల్లింపు లు చేస్తున్నామని రావత్ వెల్లడించారు.

1974 నుంచి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి వేతన సవరణ చేస్తున్నామని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. పీఆర్సీ నివేదిక పై అధ్యయనం కోసం అధికారులు కమిటీ ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అధికారుల కమిటీ 14.29 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేసిందని, అయితే సీఎం ఈ ఫిట్మెంట్ ను 23 శాతం గా నిర్దేశించారని శశిభూషణ్ పేర్కొన్నారు. 2019 జులై నుంచి పీఆర్సీ అమలు 2020 ఏప్రిల్ నుంచి ఆర్ధిక ప్రయోజనాల ను ఇవ్వాలని పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసిందన్నారు. హెచ్ ఆర్ ఏ స్లాబ్ లను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇచ్చామని,అలాగే సిటీ కంపన్సేటరీ అలవెన్సును కూడా రద్దు చేశామన్నారు. ఇవన్నీ శాస్త్రీయ విధానం లొనే ఇచ్చిన జీవోలని శశిభూషణ్ వెల్లడించారు. దేశంలోని పెద్ద రాష్ట్రాలు అన్ని కేంద్ర వేతన కమిషన్ అమలుకు వెళ్లిపోయాయని,
అఖిల భారత సర్వీసు అధికారులకు ఇచ్చే 40 వేల ఇంటి అద్దె భత్యం రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వం పై 10,247 కోట్ల అదనపు భారం పడుతుందని., ప్రస్తుతం ఏడాదికి 23 శాతం పీఆర్సీ ప్రకారం 70, 424 కోట్లు వ్యయం చేయాల్సి వస్తుందని శశిభూషణ్ పేర్కొన్నారు.

English summary
andhraprdesh government has clarified that it fails to give better prc due to covid 19 issues and other finacial problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X