విశాఖకు తరలింపు ఎప్పుడు ? నేడు హైకోర్టుకు సర్కార్ క్లారిటీ..
ఏపీలో ప్రస్తుత రాజధాని అమరావతి నుంచి కాబోయే రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై విచారణ ఇవాళ కూడా కొనసాగబోతోంది.
ఇందులో భాగంగా ప్రభుత్వం విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు అడిగిన ప్రశ్నకు ఇవాళ సమాధానం చెప్పబోతోంది. ఇందులో ప్రభుత్వం చెప్పే సమాధానం ఆధారంగా రాజధాని తరలింపుపై పూర్తి క్లారిటీ రానుంది.

అమరావతి నుంచి విశాఖకు ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోసం సర్కార్ తాజాగా జీవో జారీ చేసింది. మొత్తం 35 ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వీలుగా స్ధలాల గుర్తింపు కోసం అధికారుల కమిటీ నియమించిన ప్రభుత్వం.. వారి సాయంతో తరలింపుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అమరావతి రైతులు, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి రాజధానిపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధమంటూ వారు వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖకు కార్యాలయాల తరలింపుపై నిన్న హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికిప్పుడు తరలిస్తున్నారా లేక ఎప్పుడు తరలిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అయితే ప్రభుత్వ న్యాయవాది నుంచి సమాధానం లేకపోవడంతో ఇవాళ పూర్తి వివరాలతో రావాలని కోరుతూ విచారణ వాయిదా వేశారు.
అదే సమయంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన పిటిషన్ త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు జడ్జి ముందు ప్రస్తావించారు. దీంతో ఈ పిటిషన్ కూడా త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని కోరారు. అయితే తాను పంపలేనని, రోస్టర్ ప్రకారం తన ముందు వచ్చిన పిటిషన్ పై విచారణ జరిపి ఆదేశాలు ఇస్తానని జడ్జి పేర్కొన్నారు. దీంతో సీజే వద్ద ఈ వ్యవహారం ప్రస్తావించి తగు ఆదేశాలు తీసుకునేందుకు ప్రభుత్వ న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఈ పిటిషన్ కూడా త్రిసభ్య బెంచ్ కు సీజే బదిలీ చేస్తే అప్పుడు అక్కడే విచారణ జరిపి తీర్పు ఇస్తారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications