వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ -డీఏ పెంపుపై ఉత్తర్వులు జారీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్(డీఏ) పెంపుపై బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీనిపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Recommended Video

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల DA పెంపుపై ఉత్తర్వులు విడుదల!

నిమ్మగడ్డ అంటే భయమా? సుప్రీం షాకింగ్ తీర్పు -6లక్షలమంది ఏడుపు: ఎంపీ రఘరామనిమ్మగడ్డ అంటే భయమా? సుప్రీం షాకింగ్ తీర్పు -6లక్షలమంది ఏడుపు: ఎంపీ రఘరామ

2018లోజులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో కరువు భత్యం 27.248 శాతం నుంచి నుంచి 30.392శాతానికి పెరిగినట్లయింది. కాగా, పెంచిన డీఏను ఎప్పుడు చెల్లించేది, సీపీఎస్ వారికి ఎలా అందించేది సమగ్ర వివాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..

jagan govt issued orders on da hike to employees

పెంచిన డీఏను వచ్చే ఏడాది(2021) జనవరి జీతాలతో (ఫిబ్రవరి 1న) కలిపి నగదుగా చెల్లింపులు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2018, జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు 30 నెలల బకాయిలు జీపీఎఫ్‌/జడ్పీపీఎఫ్ వారికి 3 సమ భాగాల్లో పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయనున్నారు.

సీపీఎస్ వారికి 30 నెలల ఆరియర్స్ 90 శాతం నగదుతో పాటు 10శాతం ప్రాన్‌ అకౌంట్‌కు.. జనవరి జీతాల చెల్లింపు తర్వాత 3 సమ భాగాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 2019 జనవరి డీఏ 2021 జూలై నుంచి.. 2019 జూలై డీఏ ..2022 జనవరి నుంచి చెల్లిస్తామని కూడా సర్కారు హామీ ఇచ్చింది.

English summary
Andhra Pradesh government on Wednesday issued orders on dearness allowance(DA) hike for employees. It said it was allocating 3.144 percent of the increased drought allowance in july 2018. This increased the drought allowance from 27.248% to 30.392%
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X