వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు అరెస్ట్‌కు రంగం సిద్ధం??

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిని ఎలాగైనా అరెస్ట్ చేయాల‌నే పంతాన్ని ప్ర‌భుత్వం నెర‌వేర్చుకునే దిశ‌గా అడుగులు వేస్తోంద‌నే అభిప్రాయం ఏపీలో వ్య‌క్త‌మ‌వుతోంది. వేస‌విలో కోర్టుకు సెల‌వులు ఉంటాయి కాబ‌ట్టి ఆ స‌మ‌యంలో అరెస్ట్ చేస్తే బెయిల్ రాద‌ని, అదే చంద్ర‌బాబును అరెస్ట్ చేయ‌డానికి స‌రైన స‌మ‌యంగా ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్తలు విశ్లేషిస్తున్నారు.

ఇన్న‌ర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో బాబుపై కేసు

ఇన్న‌ర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో బాబుపై కేసు

రాజ‌ధాని అమ‌రావ‌తిలో ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి అక్ర‌మాలు జ‌రిగాయంటూ ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అక్ర‌మాలు లేవంటూ కోర్టు తీర్పునివ్వ‌డంతో కొత్త‌గా అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్‌రోడ్డు పేరుతో చంద్ర‌బాబుపై ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేసింది. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌లో మార్పులు చేర్పులు జ‌రిగాయ‌ని, దీనివ‌ల్ల రైతుల‌కు న‌ష్టం జ‌రిగింద‌ని, ఇత‌రులు ల‌బ్ధి పొందారంటూ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి సీఐడీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు

ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు

ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌వ‌ల్ల న‌ష్ట‌పోయామ‌ని ఇంత‌వ‌ర‌కు ఒక్క రైతు కూడా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేదు. కానీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేశార‌ని, ప్రాథ‌మిక ద‌ర్యాప్తు నిర్వ‌హించామ‌ని, ఆధారాలున్నాయ‌ని, కేసులు పెట్టామ‌ని సీఐడీ పోలీసులు తెలిపారు. ఆర్కే త‌న ఫిర్యాదులో సామాన్యుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని, ప్ర‌జ‌ల ఆస్తుల‌కు అప్ప‌టి ప్ర‌భుత్వం న‌ష్టం చేకూర్చిందంటూ పేర్కొన్నారు.

 నోటీసులివ్వ‌కుండా అరెస్ట్ చేయ‌డం కామ‌న్‌

నోటీసులివ్వ‌కుండా అరెస్ట్ చేయ‌డం కామ‌న్‌


ముంద‌స్తుగా ఎటువంటి నోటీసులివ్వ‌కుండా ప్ర‌భుత్వం అరెస్ట్‌లు చేయ‌డం ఏపీలో కామ‌న్‌గా మారిపోయింద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు. మాజీ మంత్రి నారాయ‌ణ ఎనిమిది సంవ‌త్స‌రా ల క్రిత‌మే చైర్మ‌న్‌గా నారాయ‌ణ విద్యాసంస్థ‌ల నుంచి త‌ప్పుకున్నార‌ని, కానీ ఆయ‌న కుమారుడి వ‌ర్థంతిరోజే కావాల‌ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారంటూ ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ప్ర‌శ్నించిన‌వారిని అరెస్ట్ చేసి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసి ప‌రిపాల‌న కొన‌సాగించాల‌నుకుంటున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేత‌లు ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఏక్ష‌ణ‌మైనా అరెస్ట్ చేయ‌వ‌చ్చు?

ఏక్ష‌ణ‌మైనా అరెస్ట్ చేయ‌వ‌చ్చు?

ఎవ‌రో ఒక‌రితో ఫిర్యాదు చేయించ‌డం.. ఆ త‌ర్వాత అరెస్ట్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంద‌ని, వారు బెయిల్ తెచ్చుకుంటే కోర్టుల‌నే వైసీపీ నేత‌లు త‌ప్పు ప‌డుతున్నార‌ని మండిప‌డుతున్నారు. నారాయ‌ణ త‌ర‌హాలోనే ఏక్ష‌ణ‌మైనా నోటీసులివ్వ‌కుండా చంద్ర‌బాబునాయుడిని అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని, ఇందులో పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు చెబుతున్నారు.

English summary
There is speculation that Chandrababu could be arrested at any moment without prior notice
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X