వదల బొమ్మాలీ వదల .. గోదావరి నదిపై తెలంగాణా ప్రాజెక్ట్ లను టార్గెట్ చేస్తున్న జగన్ సర్కార్ ; గోదావరి బోర్డుకు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు తెలుగు చానల్ సీరియల్ గా సాగుతూనే ఉన్నాయి. చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. ఏపీ తెలంగాణ రాష్ట్రాల వరుస లేఖలతో రెండు రాష్ట్రాల మధ్య అగాధం మరింత పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరీ నదీ యాజమాన్య బోర్డుకి రాసిన లేఖ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. వదల బొమ్మాలీ వదల అంటూ ఏపీ సర్కార్ తెలంగాణా ప్రాజెక్ట్ లపై విరుచుకుపడుతుంది.

గోదావరి నదిపై తెలంగాణా అనధికారిక ప్రాజెక్ట్ లను టార్గెట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం
ఇప్పుడు తాజాగా మరోమారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అనధికారిక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని గోదావరి నది యాజమాన్య బోర్డ్ కు ఏపీ సర్కార్ లేఖ రాసింది. మొన్నటి వరకు కృష్ణానదిపై నిర్మించిన అక్రమ ప్రాజెక్టులపై, అనధికారిక నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం మీద కృష్ణానది యాజమాన్య బోర్డుకు వరుస ఫిర్యాదులు చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అనధికారిక ప్రాజెక్టులను టార్గెట్ చేస్తుంది.

సీతారామ ఎత్తిపోతల, తుపాకుల గూడెం లతో పాటు మొత్తం ఐదు ప్రాజెక్ట్ లపై ఫిర్యాదు
సీతారామ ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు ముక్తేశ్వరం, చౌటపల్లి, మోడికుంట వాగు ప్రాజెక్టులకు అనుమతులను ఇవ్వొద్దని ఏపీ సర్కార్ గోదావరి నది యాజమాన్య బోర్డును కోరింది. ఇప్పటికే గోదావరి నదిపై నిర్మిస్తున్న ఐదు అనధికారిక ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) లను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది అని, వాటికి అనుమతులు ఇవ్వొద్దంటూ కోరిన ఏపీ జలవనరుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు లేకుండా గోదావరి నదీ జలాలను కూడా వాడుకుంటోందని ఆరోపించింది.

తెలంగాణా కేటాయింపుల కంటే అదనంగా నీటిని వాడుకుంటుందని ఫిర్యాదు
తెలంగాణ జీఆర్ఎంబీ ఎలాంటి కేటాయింపులు చెయ్యకుండానే ప్రస్తుతం ఉన్న తెలంగాణ కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకుంటోందని గోదావరి నది లో 450 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకుంటుందని గోదావరి నది యాజమాన్య బోర్డుకు రాసిన లేఖలో ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో అనధికార ప్రాజెక్టులకు కొత్త ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంతవరకు అనుమతి ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. భౌగోళికంగా తమకు ఉన్న అవకాశాలను తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంటోంది అని ఏడాది పొడవునా గోదావరి నది నీటిని కేటాయింపులతో నిమిత్తం లేకుండా వాడుకుంటోందని గోదావరి నది యాజమాన్య బోర్డుకు రాసిన లేఖలో స్పష్టం చేసింది.

కొత్త ట్రిబ్యునల్ నీటి వాటాలు ఖరారు చేసే వరకు అనుమతులు ఇవ్వొద్దని లేఖ
ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలను కొత్త ట్రిబ్యునల్ ఖరారు చేసే వరకూ తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్ లను ఆమోదించవద్దని, గోదావరి నదిలో నీటి లభ్యతకు సంబంధించిన స్పష్టత కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది యాజమాన్య బోర్డుకు లేఖ ద్వారా పేర్కొంది. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపీ ప్రభుత్వం, ఇప్పుడు గోదావరి నదిపై చేపట్టిన తెలంగాణ ప్రాజెక్టులపై కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, తెలంగాణ గోదావరి నీటిని దోపిడి చేస్తోందని ఆరోపిస్తోంది.

తెలంగాణాకు జరిమానా విధించాలని ఏపీ లేఖ
మొన్నటిదాకా కృష్ణా నదీ జలాల విషయంలో వరుసలేఖలు రాసింది. కేంద్రం, కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తెలంగాణకు జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. కృష్ణా నదీ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం, కృష్ణా బోర్డు నిర్ణయానికి విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని కృష్ణా బోర్డు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసి షాక్ ఇచ్చింది. అంతేకాదు తెలంగాణా ఉత్పత్తి చేసిన విద్యుత్ లో 50శాతం వాటా ఏపీకి కేటాయించాలని పేర్కొంది. అత్యవసరం సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొంది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆపాలని ఎన్జీటీకి ఏపీ అఫిడవిట్
అంతే కాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో దాఖలు చేసిన అఫిడవిట్ లోనూ ఆ ప్రాజెక్ట్ ను నిలిపివేయ్యాలని కోరింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, తాగునీటి ప్రాజెక్ట్ పేరుతో సాగునీటి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని పేర్కొంది. నిబంధనలను అతిక్రమించి చేపడుతున్న ప్రాజెక్ట్ లను నిలువరించాలని కోరింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నదీజలాల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా వరుస షాకులు ఇచ్చుకుంటూ రచ్చ చేస్తున్నారు.

అంతు చిక్కకుండా రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలు
ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పై ఏపీ ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు, కేంద్ర జలవనరుల శాఖ కు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు లేఖలు రాస్తుండటం, కోర్టు మెట్లు ఎక్కుతుండటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు జలవివాదాలను మరింత పెంచుతోంది.అటు జగన్ సర్కార్ కానీ, ఇటు కేసీఆర్ సర్కార్ గాని సయోధ్య దిశగా పోవడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరి తెలుగు రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న జలవివాదాలు భవిష్యత్తులో అయినా పరిష్కారమవుతాయా లేక మరింత వివాదాలకు కారణమవుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications